ఖమ్మం

భట్టి గెలుపుతో విజయోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్రుపాలెం, డిసెంబర్ 11: మంగళవారం వెలువడిన అసెంబ్లీ ఫలితాలలో మధిర నుండి ప్రజాకూటమి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టివిక్రమార్క విజయం సాధించడంతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల శ్రేణులు మండల వ్యాప్తంగా విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. మండల కాంగ్రెస్ కార్యాలయం వద్ద మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, తెలుగుదేశం మండల అధ్యక్షుడు దోమందుల సామేలు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేల్చి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధిర నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన భట్టి విక్రమార్కను ప్రజలు మూడవసారి గెలిపించి హ్యట్రీక్ అందించారన్నారు. ఈ సందర్బంగా మండల ప్రజలకు కూటమి అభినందనలు తెలుపుతుందని అన్నారు. ఎర్రుపాలెం, రేమిడిచర్ల, జమలాపురం, భీమవరం, మామునూరు, రాజులదేవరపాడు, వెంకటాపురం, మొలుగుమాడు, రామన్నపాలెం, ఇనగాలి గ్రామాలలో కాంగ్రెస్ , తెలుగుదేశం శ్రేణులు విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బండారు నరిశింహరావు, అనుమోలు కృష్ణారావు, కడియం శ్రీనివాసరావు, బొగ్గుల గోవర్ధన్‌రెడ్డి, నాగిరెడ్డి, సామినేని రామారావు,గూడూరు వెంకటేశ్వరరెడ్డి, గురిజాల సత్యనారాయణ, వాసిరెడ్డి శివకుమారి, వుయ్యూరు మల్లిక, మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
మదన్‌లాల్ అభ్యర్థిత్వానికి
మొదటినుండే వ్యతిరేకత
వైరా, డిసెంబర్ 11: వైరా నియోజవకర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా టిఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించిన నాటినుండే ఆయన అభ్యర్థిత్వాన్ని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు విభేధించారు. కాని ఈవిషయం జిల్లాలో ఉన్న ఆ పార్టీకి చెందిన బాస్ పెద్దగా పట్టించుకోకపోవడమే టీఆర్‌ఎస్ పార్టీకి వైరా నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేక తప్పని పరిస్థితిలో ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపించారు. రాష్టప్రార్టీ అభ్యర్థిని మార్చే నిర్ణయంపై పునరాలోచన చేసినట్లయితే వైరా సీటు కారు పార్టీకే దక్కేది. కాని జిల్లాను నడిపిస్తున్న బాస్ మదన్‌లాల్‌పై ఎనలేని ప్రేమకురిపించారు. దీంతో పార్టీ ఒక సీటు కోల్పోయింది. ఇండిపెండెంట్ అభ్యర్థి పూర్తిగా తాను నామినేషన్ గత నెల 19న వేసేంతవరకు కూడా ఎవరికి తెలియదు. అతనికి టికెట్ నిరాకరించిన కాంగ్రెస్‌పార్టీకి, వద్దు మొర్రో అని నియోజకవర్గ ప్రజలు ర్యాలీతీసి నిరసనలు తెలిపిన సీటు ఇచ్చిన టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పారు. గెలుపు ఓటమి ప్రజల చేతిలో ఉన్నదన్న విషయాన్ని కనీసం ఆలోచించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆ పార్టీలు పని చేస్తున్నాయనేది నియోజకవర్గ ప్రజల ఆలోచన. మొత్తానికి వైరా నియోజకవర్గ ప్రజలు ఆయా పార్టీలకు తగిన రీతిలో తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుతో ఆయా పార్టీలకు దిమ్మతిరిగి ఉంటుంది.