ఖమ్మం

భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాల్వంచ, డిసెంబర్ 11: స్థానిక అనుబోస్ ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం భారీ పోలీసు బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిసింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా వివిధ శాఖల అధికారులకు, పాత్రికేయులకు, కౌంటింగ్ సిబ్బందికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఉదయం 7గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ప్రారంభమైన ఎన్నికలు సాయంత్రం 4గంటల వరకు ముగిసాయి. కౌంటింగ్ కేంద్రంలో పినపాక, కొత్తగూడెం, అశ్వారావుపేట, ఇల్లందు, భద్రాచలం, నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపు సందర్భంగా వివిధ పార్టీల అభ్యర్ధులు కౌంటింగ్ కేంద్రానికి చేరుకొని ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కౌంటింగ్ కేంద్రానికి వచ్చే అధికారులకు, సిబ్బందికి కళాశాల ఆవరణలో, బయట పార్కింగ్ సౌకర్యం కల్పించడంతో వాహనాలు భారీగా నిలిచాయి. కౌంటింగ్ ప్రారంభ దశలో ఓట్ల లెక్కింపు వివరాలను పాత్రికేయులకు అందజేయడంలో అధికారులు కొంత నిర్లక్ష్యం చేసారు. దీంతో పాత్రికేయులందరూ కౌంటింగ్ బ్లాకుల వద్దకు వెళ్లి మైకుల ద్వారా వచ్చే వివరాలను సేకరిస్తుండగా పోలీస్ అధికారులు మీడియా పాయింట్ వద్దకు వెళ్లాలని కోరారు. అక్కడి నుండి ఓట్ల లెక్కింపు వివరాలను పాత్రికేయులకు సకాలంలో అందించగలిగారు. కౌంటింగ్ కేంద్రం వద్ద అత్యవసర పరిస్థితుల్లో వైద్య సిబ్బందితో పాటు ఫైర్, విద్యుత్‌శాఖ అధికారులు అందుబాటులో ఉన్నారు. కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రజిత్‌కుమార్‌షైనితో పాటు జిల్లా ఎస్‌పి సునీల్‌దత్‌లు సందర్శించి లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మొత్తానికి ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ముగిసాయి.