ఖమ్మం

కొత్తగూడెంలో కూటమి అభ్యర్థి వనమా విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, డిసెంబర్ 11: కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రజాకూటమి బలపర్చిన కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు తన సమీప టిఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావుపై విజయం సాధించారు. మంగళవారం పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల కౌంటింగ్‌ను నిర్వహించారు. వనమా వెంకటేశ్వరరావు తన సమీప టిఆర్‌ఎస్ అభ్యర్థిపై 40148ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వనమా వెంకటేశ్వరరావుకు 80141 ఓట్లు రాగా టీఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావుకు 75845 ఓట్లు వచ్చాయి. ఎన్నికల ఫలితాలలో ప్రతిరౌండ్‌లోనూ వనమా అధిక్యతను కొనసాగించారు. 18 రౌండ్లుగా విభజించి ఓట్లలెక్కింపును కొనసాగించారు. మొదటి రౌండ్‌లో వనమాకు 4872 ఓట్లు పోల్‌కాగా, టిఆర్‌ఎస్ అభ్యర్థి జలగంకు 3077ఓట్లు పొలయ్యాయి. రెండవరౌండ్‌లో వనమాకు 10851ఓట్లు పోల్‌కాగా, జలగంకు 7321ఓట్లు పోలయ్యాయి. 3వ రౌండ్‌లో వనమాకు 14703 ఓట్లు పోల్‌కాగా, జలగంకు 11853ఓట్లు పోలయ్యాయి. 4వరౌండ్‌లో వనమాకు 19731ఓట్లు పొలవ్వగా, జలగంకు 16122ఓట్లు పోలయ్యాయి. 5వరౌండ్‌లో వనమా 24333ఓట్లుపోలవ్వగా, జలగంకు 20501ఓట్లు పోలయ్యాయి. 6వరౌండ్‌లో వనమాకు 29413ఓట్లు పోలవ్వగా, జలగంకు 24735ఓట్లు పోలయ్యాయి. 7వరౌండ్‌లో వనమాకు 35122 ఓట్లు పోలవ్వగా, జలగంకు 28832ఓట్లు పోలయ్యాయి. 8వరౌండ్‌లో 40067ఓట్లు పోలవ్వగా, జలగంకు 33399ఓట్లు పొలయ్యాయి. 9వరౌండ్‌లో వనమాకు 44631ఓట్లు పోలవ్వగా, జలగంకు 39078ఓట్లు పోలయ్యాయి. 10వరౌండ్‌లో వనమాకు 48820ఓట్లు పోలవ్వగా, జలగంకు 44033ఓట్లు పొలయ్యాయి. 11వరౌండ్‌లో వనమాకు 52555ఓట్లు పోలవ్వగా, జలగంకు 48423ఓట్లు పోలయ్యాయి. 12వరౌండ్‌లో వనమాకు 56234ఓట్లు పోలవ్వగా, జలగంకు 52815ఓట్లు పోలయ్యాయి. 13వరౌండ్‌లో వనమాకు 60752ఓట్లు పోలవ్వగా, జలగంకు 57237ఓట్లు పొలయ్యాయి. 14వరౌండ్‌లో వనమాకు 64628ఓట్లు పోలవ్వగా, జలగంకు 62187ఓట్లు పోలయ్యాయి. 15వరౌండ్‌లో వనమాకు 68696ఓట్లు పోలవ్వగా, జలగంకు 66507ఓట్లు పోలయ్యాయి. 16వరౌండ్‌లో వనమాకు 73854ఓట్లు పోలవ్వగా, జలగంకు 70694ఓట్లు పోలయ్యాయి. 17వరౌండ్‌లో వనమాకు 79808ఓట్లు పోలవ్వగా, జలగంకు 75575ఓట్లు పోలయ్యాయి. 18వరౌండ్‌లో వనమాకు 80141ఓట్లు పోలవ్వగా, జలగంకు 75845ఓట్లు పోలయ్యాయి. పోస్టల్‌బ్యాలెట్‌లో వనమాకు 565ఓట్లు పోలవ్వగా, జలగం వెంకటరావుకు 745ఓట్లు పోలయ్యాయి. కొత్తగూడెం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావు, టిఆర్‌ఎస్ అభ్యర్థిగా జలగం వెంకటరావు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ అభ్యర్థిగా ఎడవల్లి కృష్ణతో పాటు 16మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. స్వాతంత్ర అభ్యర్థులతో పాటు భారతీయ జనతా పార్టీ, బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్‌లు దక్కని పరిస్థితి ఎదురైంది.