ఖమ్మం

ప్రజాదరణకు నోచని బీఎల్‌ఎఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 12: కమ్యూనిస్టు పార్టీకి కంచుకోటగా దేశంలోనే కమ్యూనిస్టు ఖిల్లాగా పేరొందిన ఖమ్మం జిల్లాలో బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ పట్ల ఓటర్లు ఆసక్తి చూపలేదు. సామాజిక న్యాయం - సమగ్రాభివృద్ధే ధ్యేయంగా అనేక సంఘాలతో సీపీఎం నేతృత్వంలో ఏర్పడిన బీఎల్‌ఎఫ్ పది నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పటికీ ఎక్కడా ఆశించిన స్థాయిలో ఓట్లు దక్కలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఎల్‌ఎఫ్ పేరుతో మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటీచేయగా ఆరుచోట్ల సీపీఎం గుర్తుతో పోటీ చేశారు. ఇల్లెందు నియోజకవర్గంలో మాత్రం సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీకి బిఎల్‌ఎఫ్ మద్దతిచ్చింది. మధిరలో బిఎల్‌ఎఫ్ అభ్యర్థిగా పోటీచేసిన కోటా రాంబాబుకు అత్యధికంగా 23,030 ఓట్లు రాగా, భద్రాచలంలో బిఎల్‌ఎఫ్ మద్దతుతో సీపీఎం అభ్యర్థిగా పోటీచేసిన మిడియం రాంబాబుకు 14,228 ఓట్లు వచ్చాయి. పాలేరులో పోటీచేసిన బత్తుల హైమావతికి 6,769, సత్తుపల్లిలో పోటీచేసిన మాచర్ల భారతికి 2,673, వైరాలో పోటీచేసిన భూక్యా వీరభద్రంకు 11,373, అశ్వారావుపేటలో పోటీచేసిన రవీందర్‌కు 4,887, పినపాకలో పోటీచేసిన నాగేశ్వరరావుకు 2,581ఓట్లు లభించాయి. అలాగే సిపిఎం మద్దతుతో బిఎల్‌ఎఫ్ అభ్యర్థులుగా ఖమ్మంలో పోటీచేసిన పాల్వంచ రామారావుకు 1091, కొత్తగూడెంలో పోటీచేసిన యడవల్లి కృష్ణకు 5,520ఓట్లు వచ్చాయి. మొత్తం ఓట్లలో కోటా రాంబాబు, మిడియం రాంబాబులు మాత్రమే పదిశాతానికి పైగా ఓట్లు సాధించారు.