ఖమ్మం

దమ్మపేటలో తుమ్మలకు ధిక్కార స్వరం !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దమ్మపేట, డిసెంబర్ 12: నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో తుమ్మల నాగేశ్వరావుకు సొంత మండలంలోనే చేదు అనుభవం ఎదురైంది. ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనం కావడంతో ఆయనను అనుసరించిన తుమ్మల వర్గీయులు తొలిసారిగా సొంత మండలంలో ధిక్కార స్వరం వినిపించారు. తాటి వెంకటేశ్వర్లును గెలిపించాలనే తుమ్మల మాటను బేఖాతరు చేస్తూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మెచ్చాకు బాహటంగా మద్దతిచ్చి మండలంలో రికార్డు స్థాయిలో 7714 భారీ మెజారిటీని కట్టబెట్టారు. 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ ఆరంగేట్రం చేసిన తుమ్మలను దమ్మపేట మండలం అక్కున చేర్చుకొంది. ఆయన గెలిచినా, ఓడినా ప్రతి ఎన్నికలో మండలం నుండి భారీ మెజారిటీ కట్టబెట్టారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నా స్థానిక ఎన్నికల్లో ఆయన మాట వేదవాక్కులా భావించి మండలంలో ఆధిక్యత కట్టబెట్టారు. తుమ్మల సొంత పార్టీని వీడి టిఆర్‌ఎస్‌లో చేరినా ఆయన వర్గీయులు, సొంత సామాజిక వర్గం ఆయన బాటలోనే పయనించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రి గా ఉన్న ఆయన కనుసన్నల్లోనే పార్టీ అంతా నడిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో తాటి వెంకటేశ్వర్లుకు మద్దతు పలకాలన్న తుమ్మల మాటను ఇద్దరు, ముగ్గరు నాయకులు మినహా మిగతా వారంతా బేఖాతరు చేశారు. సొంత సామాజిక వర్గం ఎదురు తిరిగింది. దీంతో దేశం అభ్యర్ధి మెచ్చాకు మండలంలో కనీవిని ఎరుగని రీతిలో 7714 ఆధిక్యత లభించింది. తుమ్మల సామాజికవర్గం ప్రభావిత గ్రామాల్లో ఎన్నిక ఏకపక్షంగా సాగింది. తుమ్మల సొంత గ్రామంలో సైతం దేశం అభ్యర్థికి మెజారిటీ రావడం ఆయన ప్రతిష్ట మసక బారేలా చేసింది. ఒకరిద్దరు నాయకులు మినహా తుమ్మలకు ఎవరితోను మాటమంతీ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆయన సమీప బంధువు వ్యాఖ్యానించారు.