ఖమ్మం

పంచాయతీ ఎన్నికలపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), డిసెంబర్ 12: సాధారణ ఎన్నికలు ముగియడంతో అందరి దృష్టి పంచాయతీ ఎన్నికలపై పడింది. హైకోర్టు జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, బీసీల రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఉండాలని ఆదేశించింది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన మరుసటి రోజు బుధవారం హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్ సిఎల్‌పి శాసనసభ పక్షనేతగా కెసిఆర్ ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో కెసిఆర్ మాట్లాడుతూ జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అధికార యంత్రాంగం హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న తరుణంలో హైకోర్టుతో పాటు కెసిఆర్ కూడా పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రస్తావన తేవడంతో పంచాయతీ ఎన్నికలపై సమాలోచనలో పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించిన అధికారులు పంచాయతీ ఎన్నికలను కూడా సమర్థవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. గతంలో సార్వత్రిక ఎన్నికల ముందే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా అప్పట్లో బిసి రిజర్వేషన్ల విషయంలో 50శాతం దాటడంతో హైకోర్టు ప్రభుత్వాన్ని మందలించింది. అంతేకాకుండా సార్వత్రిక ఎన్నికల ముందు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని అప్పటి ప్రభుత్వం అన్ని సిద్ధం చేసినప్పటికి హైకోర్టు ఆదేశంతో ఎన్నికలు వాయిదాపడింది. అప్పటికే రాష్ట్రంలోని 500 జనాభా గల అన్ని తండాలను గ్రామపంచాయతీలుగా మార్చింది. రాష్ట్రంతో పాటు ఖమ్మం జిల్లాలో కూడా అధికార యంత్రాంగం ఓటర్ల జాబితాను సిద్ధంచేసి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో 584 పంచాయతీలు, 5338 వార్డులలో మొత్తం 7,20,045 ఓటర్లు జాబితాను ప్రకటించింది. ప్రస్తుతం టిఆర్‌ఎస్ సిఎల్‌పి నేత కెసిఆర్ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవడంతో అధికార యంత్రాంగం బీసీ ఓటర్ల గణనతో పాటు తిరిగి ఓటర్ల జాబితాను సిద్ధం చేయవలసి ఉంది. ఈ నెల 26 నుండి ఓట్లు లేనివారికి అవకాశం కల్పిస్తూ ఓటు పొందేందుకు దరఖాస్తులను అహ్వానించారు. జిల్లా అధికార యంత్రాంగం కొత్త ఓటర్లను చేర్చుకోవడంతో పాటు బీసీ ఓటర్ల గణన జాబితాకు సిద్ధమవుతున్నారు. జనవరి 10లోపు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు.