ఖమ్మం

అభివృద్ధే గెలిపించింది.. ప్రజల వెంటే ఉంటా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 14: తన నాలుగున్నరేళ్ళ పదవీకాలంలో ఖమ్మం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధే తిరిగి తనను గెలిపించిందని, తనను ఓడించేందుకు అనేక శక్తులు పలు రకాలుగా ప్రయత్నించినప్పటికీ ప్రజలు తనవెంటే ఉన్నారని రుజువైందని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకెళ్ళడంలో ముందున్నామన్నారు. అందుకే పోలైన ఓట్లలో సగానికి పైగా తనకు దక్కాయని, ప్రజలు తనవెంటే ఉన్నారనేందుకు ఇంతకంటే నిదర్శనం అవసరం లేదన్నారు. తనను ఓడించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పెద్దలు, నిధులు వచ్చినా ప్రజలు వాటిని పట్టించుకోకపోవడం రాజకీయ చైతన్యానికి మారుపేరైన ఖమ్మం ప్రజలకే దక్కిందన్నారు. దాదాపు రెండునెలల పాటు తనతో పాటు కష్టపడిన కార్పొరేటర్లు, నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో తనను ఓడించేందుకు కొందరు ఉద్యోగులతో పాటు కొందరు రాజకీయ పార్టీల నేతలు ప్రయత్నించారని, వారు ఇకనైనా ప్రజాభిప్రాయాన్ని గౌరవించి మారాలని హితవు పలికారు. కాగా ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్ పార్టీ తరపున తానొక్కడినే గెలిచినప్పటికీ అధినేత కెసిఆర్ ఏ బాధ్యతను అప్పగించినా పనిచేస్తానని, యువ నాయకుడు కెటిఆర్‌కు రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం కొత్త విధానాలను ప్రవేశపెడుతున్నామనేందుకు నిదర్శమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు ఖమ్మంలోనే మకాంవేసి తనను ఓడించేందుకు ప్రయత్నించారని, అదే సమయంలో తన కుటుంబీకులతో పాటు స్నేహితులు, మద్దతుదారుల సహకారంతో వారికి గుణపాఠం చెప్పగలిగామన్నారు. ప్రచార సమయంలో తాను అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రజలు అనేక సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, ముందు వాటిని పరిష్కరించి తాను ప్రజలతోనే ఉంటానని నిరూపించుకుంటానన్నారు. అనంతరం నగరానికి చెందిన పలువురు ప్రముఖులు అజయ్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలపగా, బాణాసంచా పేల్చి సంబురాలు జరుపుకున్నారు.