ఖమ్మం

పెథాయ్ తుఫాన్‌తో రైతుకు తీరని నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలూరుపాడు, డిసెంబర్ 17: పెథాయ్ తుఫాన్ కారణంగా గత రెండు రోజులుగా కురిసిన అకాల వర్షానికి మండలంలో రైతులు సాగు చేసిన వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కాకర్ల, జూలూరుపాడు, గుండెపుడి, పడమట నర్సాపురం, వెంగన్నపాలెం తదితర ప్రాంతాల్లో వరి పంటను కోసి పొలాల్లో ఉన్న సమయంలో వర్షం ముంచుకురావటంతో పంట దెబ్బతిని రైతులకు తీరని నష్టం జరిగింది. ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంట తీరా చేతికొచ్చిన తరుణంలో వర్షార్పణం కావటంతో రైతులు దిక్కుతోచక బిక్కమొఖం వేస్తున్నారు. ఇదిలా ఉండగా మండలంలోని పలు గ్రామాల్లో సాగులో ఉన్న మొక్కజొన్న వర్షంతోపాటు బలమైన ఈదురుగాలులకు నేలమట్టం కావటంతో పంట పూర్తిగా దెబ్బతింది.

తుఫాన్‌కు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఏఓ
వేంసూరు, డిసెంబర్ 17: ఫెథాయ్ తుఫాన్‌తో మండలంలో దెబ్బతిన్న పంటలను వ్యవసాయ అధికారి రామ్మోహనరావు సోమవారం పరిశీలించారు. కందుకూరు, దుద్దెపూడి, భరిణిపాడు, అమ్మపాలెం గ్రామంలో పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో ఆయన పర్యటించి సహాయక చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులకు వివరించారు. ప్రధానంగా అమ్మపాలెం, దుద్దెపూడి గ్రామాల్లో సుమారు 350 ఎకరాల్లో వరి పంట నష్టం జరిగినట్లు అంచనాలు వేశారు. వరి మడులలో నీరు నిల్వ లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు. తడిసన పంట మొక్క వచ్చే సూచనలు కనిపిస్తే పంటకు ఉప్పు నీటితో పిచకారి చేసి మొలక రాకుండా కొంత మేర పంట కాపాడుకోవచ్చని తెలియజేశారు. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని, ఒకవేళ వస్తే తడవకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట ఏఈఓలు ఆశాజ్యోతి, అనూష పలువురు రైతులు ఉన్నారు.

నిండా ముంచిన పెథాయ్ తుపాన్
* చేతికొచ్చిన పంట నీళ్ళపాలు * కంట నీటితో రైతులు

సత్తుపల్లి, డిసెంబర్ 17: పెథాయ్ తుఫాన్ ప్రభావం సత్తుపల్లి మండలంలో తీవ్ర నష్టం మిగిల్చింది. సోమవారం సత్తుపల్లి మండలంలో 88.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రెండు రోజులుగా వీస్తున్న చలిగాలులు, ఆదివారం రాత్రి, సోమవారం కురిసిన వర్షానికి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం బస్తాలు, రైతులు ఆరబోసుకున్న ధాన్యం రాసులపై పట్టాలు కప్పుకుని, వాటిచుట్టూ నీళ్ళు పోయేందుకు పారలతో కాలువలు తీసే పనిలో నిమగ్నమయ్యారు. తుంబూరు, సదాశివునిపేట, కిష్టారం ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యం బస్తాలను వర్షంలోనే కూలీలతో లారీలలో లోడ్ చేసుకున్నారు. కొనుగోలు కేంద్రాలలో ఆరబోసుకున్న ధాన్యం వరద నీరు చేరి తడిసిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సదాశివునిపాలెం, తుంబూరు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ధాన్యం బస్తాలను ఐకేపి అధికారులు సందర్శించి లారీలకు లోడింగ్ కేటాయించారు. చేతికొచ్చిన పంట అమ్ముకునే సమయంలో తుఫాన్ రూపంలో ముంచిందని రైతులు వాపోతున్నారు. బాసారం, కొమ్ముగూడెం, రుద్రాక్షపల్లి, గంగారం, తుంభూరు, గ్రామాలలో సీడ్ మొక్కజొన్న చేలు గాలులకు ఒరిగిపోయాయి.. ఖరీప్ నార్లు పోసుకున్న రైతులు ఈ వర్షం ఎంతగానో ఉపయోగపడిందని, నారుమళ్ళు సైతం మునిగిపోయాయని తెలిపారు. కిష్టారం గ్రామంలోని పాలకుర్తి భూషణం ఇళ్ళు వరదనీటితో నిండిపోయిందని తెలిపారు.