ఖమ్మం

నేడు ఉత్తరద్వార దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, డిసెంబర్ 17: భక్తకోటి పరమ పవిత్రంగా భావించే ముక్కోటి ఏకాదశి వేళ ఉత్తర ద్వార దర్శనానికి భద్రాద్రి దేవస్థానం ముస్తాబైంది. ఏడాదిలో ముక్కోటి రోజున ఉత్తరద్వారం గుండా దర్శనమిచ్చే నీలిమేఘశ్యాముడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తనున్నారు. డిసెంబర్ 8వ తేదీ నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యనోత్సవాలు సాగగా.. తొలి పదిరోజుల పాటు పగల్‌పత్తు ఉత్సవాలను నిర్వహించారు. పగల్‌పత్తు ఉత్సవాల ముగింపును పురస్కరించుకోని సోమవారం రామాలయంలో తిరుమంగై ఆళ్వార్ పరమపదోత్సవం, వేద పఠనం గావించారు. సాయం సంధ్యవేళ పవిత్ర గోదావరిలో తెప్పోత్సవాన్ని సైతం నిర్వహించారు. అనంతరం మంగళవారం తెల్లవారుజామున ఉత్తరద్వారంలో వైకుంఠ రాముడు భక్తులకు దర్శనమివ్వనుండటంతో అందుకు అనుగుణంగా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తమ ఆరాధ్య దైవమైన భద్రాద్రి రామయ్య వైకుంఠ ధామునిగా దర్శనం ఇవ్వనుండటంతో అశేష భక్తజనం ఆ మధుర ఘడియల కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
నాటి నుంచి ఈ సంప్రదాయమే..
భక్తరామదాసు పాల్వంచ పరగణాకు తహసిల్దార్‌గా ఉన్న కాలం నుంచి వస్తున్న సంప్రదాయంలో భాగంగా.. వైకుంఠ ఏకాదశి నాడు ముందుగా స్థానిక తహసిల్దార్ ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి మేళతాళాలు, భాజాభజంత్రీల నడుమ రామాలయం నుంచి ఉత్తరద్వారం వైపు స్వామిని తీసుకు రానున్నారు. సరిగ్గా ఐదు గంటల సమయంలో స్వామివారు వైకుంఠ రామునిగా భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ సమయంలో ఆరాధన, శ్రీరామ షడాక్షరి మంత్ర సంపుటిత అష్టోత్తర శతనామార్చన, చతుర్వేద విన్నపాలు గావించనున్నారు. ఇదే సమయంలో దేవస్థానం వైదిక సిబ్బంది ద్వారదర్శన ప్రాశస్త్యం వివరించనున్నారు. అనంతరం శరణాగతి గద్య విన్నపం, తిరుపల్లాండు, మంగళాశాసనం, 108 వత్తులతో హారతి సమర్పించి అడుగో కోదండపాణి కీర్తనతో వైకుంఠ ద్వారం నుంచి స్వామి ఉత్థాపన చేయనున్నారు.