ఖమ్మం

రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైరా, డిసెంబర్ 18: పెథాయ్ తుఫాన్‌తో వరిపంట, ధాన్యం తడిసిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. మంగళవారం స్థానిక వైరా మార్కెట్ యార్డులో తడిసిన వరిధాన్యాన్ని ఆయన వ్యవసాయశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పెనుతుఫాన్ కారణంగా రైతులు నియోజకవర్గంలో నష్టపోయిన ప్రతిపంటపై అధికారులు నివేదిక అందిన వెంటనే వ్యవసాయశాఖ అధికారులతో పంటనష్టం లెక్కలు వేయించి తగిన విధంగా రైతులను ఆదుకునేలా కృషి చేస్తానని అన్నారు. అనంతరం కొణిజర్ల, వైరా మండలాలకు చెందిన రైతుల ఎమ్మెల్యేతో తమ గోడు వేళ్ళబోసుకున్నారు. రైతులతో తమసమస్యలను వినతిపత్రంతో సమర్పించారు. ఆరుగాలం కష్టించిపండించిన పంట తుదకు ఇలా తడిసిముద్దఅయిందని కన్నీరు పెట్టారు. దీంతో చలించిన ఎమ్మెల్యే తప్పక రైతులందరికీ న్యాయం జరిగేలా జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట వ్యవసాయశాఖ అధికారులతోపాటు నాయకులు బొర్రా రాజశేఖర్, గుమ్మా రోశయ్య, సూతకాని జైపాల్, ముళ్ళపాటి సీతారాములు, దార్నశేఖర్, పసుపులేటి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.