ఖమ్మం

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, జనవరి 10: గిరిజన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని, చదువుతో పాటు క్రీడలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ఎదగాలని ఐటీడీఏ పీవో పమేలా సత్పతి పేర్కొన్నారు. తెలంగాణ రాష్టస్థ్రాయి గిరిజన క్రీడోత్సవాలు భద్రాచలంలో గురువారం ఘనంగా ముగిశాయి. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ క్రీడల ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా ఐటీడీఏ పీవో హాజరయ్యారు. గిరికూనలు చదువుతూ ఆటలాడుతూ తమ భవిష్యత్‌కు మంచి మార్గాన్ని వేసుకోవాలన్నారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులను ప్రోత్సహించి రాష్టస్థ్రాయి క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించేందుకు కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయుల సేవలు అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాల నుంచి వచ్చిన గిరిజన బాలబాలికలు మూడురోజులు పాటు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. అన్ని క్రీడల్లో తమ సత్తా చాటుకొని బహుమతులు సొంతం చేసుకున్నారని అభినందించారు. విద్యార్థులు విద్యతో పాటు అదనంగా క్రీడల్లో పాల్గొంటున్నారని, దీనివల్ల వారిలో మానసిక ఉల్లాసంతో పాటు చురుకుతనం పెరుగుతుందన్నారు. గిరిజన క్రీడోత్సవాలు తొలిసారి భద్రాచలంలో నిర్వహించేందుకు అవకాశం కల్పించిన గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ బెన్‌హర్ మహేష్‌దత్ ఎక్కా, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టినా జెడ్ చెంగ్తోకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసి మేటి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తయారు కావడానికి ఇదొక చక్కటి అవకాశంగా విద్యార్థులు తీసుకోవాలన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు వారి గమ్యస్థానాలకు వెళ్లేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రాష్టస్థ్రాయి పోటీలు ఇంత ఘనంగా నిర్వహించడానికి కృషి చేసిన గిరిజన సంక్షేమశాఖ అధికారులు, సిబ్బందిని అభినందించారు. క్రీడలకు సంబంధించిన ఏర్పాట్లలో పాలుపంచుకున్న గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బంది, పోలీసుశాఖలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కాగా ఈ పోటీల్లో ఓవరాల్ చాంఫియన్‌షిప్‌గా భద్రాచలం నిలిచింది. ద్వితీయస్థానంలో ఏటూరునాగారం, ఊట్నూరు తృతీయస్థానాల్లో నిలిచాయి. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ డీడీ రామ్మూర్తి, తెలంగాణ రాష్ట్ర క్రీడల నిర్వహణ అధికారి వి.జ్యోతి, జిల్లా క్రీడల అధికారి పుట్టా శంకరయ్య, ఏపీవో జనరల్ నాగోరావు, అసిఫాబాద్ ఏటీడీవో శ్రీనివాస్, ఏటూరునాగారం డీటీడీవో ఎర్రయ్య, ఏటూరునాగారం డిప్యూటీ డీఈవో నర్సింహా, సంబంధిత ఏటీడీవోలు జహీరుద్దీన్, లక్ష్మణ్‌బాబు, సత్యనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు, గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.