ఖమ్మం

ప్రజల కోసం బతికిన నేత రఘు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(కల్చరల్), జనవరి 10: స్వార్థంతో ఎవరికి వారే జీవిస్తున్న ఈ రోజుల్లో తన ఆరోగ్యాన్ని సహితం లెక్కచేయకుండా ప్రజల కోసం, ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న నేత ఏలూరి రఘు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సిపిఎం టూటౌన్ మండల కమిటి సభ్యుడు, ఖమ్మం డివిజన్ నాయకులు కామ్రేడ్ ఏలూరి రఘు సంతాపసభ ఆపార్టీ టూటౌన్ కార్యదర్శి వై విక్రమ్ అధ్యక్షతన స్ధానిక హరిత గార్డెన్‌లో జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ రఘు పార్టీ కార్యకర్తగానే కాకుండా వారి కుటుంబం వ్యక్తిగతంగా తనతో సన్నిహితంగా ఉండేదని తెలిపారు. మనిషి పుట్టుక, మరణిచడం అనేది చిన్న విషయమని, ఏ మనిషైనా బ్రతికున్నంత కాలం ఎలా బ్రతికాడన్నదే ముఖ్యమని, కొద్దిమంది మాత్రమే ప్రజలకోసం బ్రతుకుతారని అలాంటి వారిలో రఘు ఒకడని కొనియాడారు. డబ్బుకోసం గడ్డికరిచే ఈ రోజుల్లో ఎర్రజెండాతోనే చివరిదాకా నడిచిన యోధుడు రఘు అన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతం అజరామరమైందని, రఘు కుటుంబం మొత్తం కమ్యూనిస్టు ఉద్యమంలోనే గడిపిందని, ఆకుటుంబం ఖమ్మం జిల్లాలో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. రఘు కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ రఘు మరణంతో యావత్ పార్టీ యంత్రాంగం ఒక కుటుంబ సభ్యుడ్ని కోల్పోయిందన్నారు. రఘు పార్టీకోసం, ప్రజలకోసం తన జీవితాన్ని పణంగా పెట్టి పనిచేశాడని ఆయన తెలిపారు. పాల్వంచలో విద్యార్ధి దశ నుండే విద్యార్ధి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనేవాడని తెలిపారు. కమ్యూనిస్టు ఉద్యమంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా పార్టీ అభవృద్ధికోసం నిబద్దతగా పనిచేశాడని తెలిపారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం సాయిబాబు మాట్లాడుతూ సిద్ధాంతంకోసం సమాజ మార్పుకోసం నిర్మొహమాటంగా తాను నమ్మిన సిద్దాంతంకోసం ఎన్నో ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నాడన్నారు. రాష్ట్ర కమిటి సభ్యుడు పి సోమయ్య మాట్లాడుతూ రఘు తండ్రి ఖమ్మం జిల్లా కమ్యునిస్టు ఉద్యమ నిర్మాణంలో ఒకరని, అలాంటి తండ్రి ఆశయ సాధనకోసం కడదాకా పేద ప్రజలకోసం పనిచేసిన ఉద్యమనేత రఘు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నవతెలంగాణ ఎడిషన్ మేనేజర్ ఎం సుబ్బారావు, పార్టీ రాష్ట్ర కమిటి సభ్యులు బుగ్గవీటి సరళ, పొన్నం వెంకటేశ్వరరావు, సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, సిపిఐ జిల్లా నాయకులు వినయ్, టిడిపి రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబిస్వర్ణకుమారి, టిఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావా రవి, మాజీ ఎంపి మిడియం బాబురావు, టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సిపిఐ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు తదితరులు పాల్గొని ముందుగా రఘు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.