ఖమ్మం

సరిహద్దులో జోరుగా కోడి పందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధిర జనవరి 16: సంక్రాంతి పర్వదినం సందర్భంగా తెలంగాణాకు సరిహద్దుగా ఉన్న ఆంధ్రాప్రాంతంలో జోరుగా కోడి పందాలను నిర్వహించారు. భోగి, సంక్రాంతి, కనుమ మూడురోజుల పాటు తెలంగాణాకు సరిహద్దుగా ఉన్న ఊటుకూరు, మొరుసుమల్లి, కాకర్ల, తిరువూరు, జగ్గయ్యపేట, ధర్మాజిగూడెం వంటి ప్రాంతాలలో నిర్వాహకులు కోడి పందేలను, చిన్నబజార్, పెద్దబజార్, గుండాట, కోసాట, లోనబయట, పేకాట, రింగాటలను సకల సౌకర్యాల మధ్య నిర్వహించారు. కోడి పందేలు, జూదం ఆటలలో 3రోజులలో కోట్లరూపాయలు చేతులు మారాయి. తెలంగాణ ప్రాంతంలో వీటిపై పూర్తి స్థాయిలో నిషేధం కొనసాగడంతో సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఆంధ్రాలో కోడి పందాలను తిలకించేందుకు ఉమ్మడి ఖమ్మంజిల్లా ప్రజలతో పాటు నల్గొండ, వరంగల్ జిల్లాల నుండి కూడా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. వీటిని నిర్వహించేందుకు నిర్వాహకులు జనరేటర్లు ఏర్పాటు చేసి రాత్రివేళల్లో కూడా వాటిని కొనసాగించారు. ఈ పందేలను తిలకించేందుకు మగవారితోపాటు మహిళలు, పిల్లలు కార్లు, ద్విచక్ర వాహనాలపై పెద్దఎత్తున తరలిరావడంతో పలుచోట్ల ట్రాఫిక్‌కు కూడా అంతరాయం ఏర్పడింది. కోడిపందాలు, జూదాలను తిలకించేందుకు రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు కూడా పెద్దఎత్తున తరలివచ్చారు. జాతరను తలపించేలా నిర్వహకులు ఏర్పాట్లు చేయడంతో చూసేందుకు వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. వీటిని తిలకించేందుకు వచ్చిన వారు వచ్చే సంవత్సరం కూడా నిర్వహించాలంటూ వెనుతిరుగుతుండటంతో మరిన్ని ఏర్పాట్లతో వీటిని నిర్వహిస్తామని పేర్కొనడం గమనార్హం.

భూముల నష్టపరిహర విషయమై రైతులతో చర్చించిన జేసీ
కూసుమంచి, జనవరి 16: జాతీయ రహదారుల కోసం భూములు కోల్పోనున్న రైతులకు నష్టపరిహారం చెల్లింపు గురించి జిల్లా జాయింట్ కలెక్టర్ అయెషామస్రత్‌ఖానం బుధవారం కూసుమంచి తహశీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కూసుమంచి రెవెన్యూ పరిధిలో సుమారు 77మంది రైతులు తమ భూమిని జాతీయ రహదారి కోసం కోల్పోనుండటంతో నష్టపరిహారం విషయంపై రైతులు రాజీపడకుండా కోర్టుకు వెళ్ళడంతో అలా వాయిదాపడింది. బుధవారం జరిగిన సమావేశానికి హాజరైన రైతులు జెసితో తమ బాధను విన్నవించారు. జెసి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం ఎకరానికి 12లక్షల రుపాయలు మాత్రమే నష్టపరిహారం ఇస్తుందని తెలిపారు. కానీ రైతులు ఈ నష్టపరిహారానికి ససేమిరా ఒప్పుకోవడం లేదు. తమభూముల ధరలు బహిరంగ మార్కెట్‌లో సుమారు 60లక్షలు పలుకుతుంటే ఎకరం 12లక్షలకు ఎలా ఇవ్వగలమని డిమాండ్ చేశారు. తమకు భూమి కింద వేరే ప్రాంతంలో భూమి ఇవ్వాలని లేదా మార్కెట్ ధరకు అటూఇటుగా నష్టపరిహరం ఇవ్వాలని జెసికి విన్నవించుకున్నారు. లేనిచో భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పడంతో చర్చలు అర్థాంతరంగా ముగిసాయి. ఈ కార్యక్రమంలో తహశీల్థార్ జె స్వర్ణ, ఆర్‌ఐ వసీమ్‌లు పాల్గొన్నారు.