ఖమ్మం

కాంగ్రెస్ శాసనసభా పక్షనేతగా భట్టి...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 16: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన నేతగా, రాష్ట్ర పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మధిర శాసన సభ్యుడు మల్లు భట్టివిక్రమార్క కాంగ్రెస్ శాసనసభా పక్షనేతగా ఎన్నిక కానున్నారు. ఆ పార్టీ నేతల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రచార కమిటీ చైర్మన్‌గా పనిచేసిన ఆయనను సిఎల్‌పి నేతగా ఎన్నుకునేందుకు ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. గతంలో ఆంధ్రాబ్యాంకు డైరెక్టర్‌గా, ఎమ్మెల్సీగా పనిచేసిన భట్టి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీ విప్‌గాను, డిప్యూటీ స్పీకర్‌గాను పనిచేశారు. మూడుసార్లు మధిర నియోజకవర్గంలో వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించిన ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించారు. రాష్టవ్య్రాప్తంగా కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీచినప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఆరు స్థానాల్లో కాంగ్రెస్, రెండు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంలో కీలకంగా పనిచేశారు. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. శాసనసభా పక్షనేత పదవి కోసం పలువురు కాంగ్రెస్ ప్రధాన నేతలు పోటీ పడుతున్నప్పటికీ అధిష్టానం మాత్రం అనుభవం, భాషా పరిజ్ఞానం, సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని భట్టివైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం పార్టీ అధినేతల నుంచి ఇప్పటికే మల్లు భట్టివిక్రమార్కకు అందిందని, ఆయనను అభినందించేందుకు హైదరాబాద్ తరలి వెళ్తున్నామని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహాకూటమి 8స్థానాల్లో విజయం సాధించగా అందులో 6స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. భట్టివిక్రమార్కతో పాటు కాంగ్రెస్ అభ్యర్థులుగా విజయం సాధించిన వనమా వెంకటేశ్వరరావు, కందాల ఉపేందర్‌రెడ్డి, రేగా కాంతారావు, పొడెం వీరయ్య, బాణోత్ హరిప్రియలు బుధవారం సాయంత్రమే భట్టివిక్రమార్కతో ప్రత్యేకంగా సమావేశమైనట్లు సమాచారం. క్యాబినేట్ హోదా కలిగిన శాసనసభా పక్షనేతగా తమ నేత ఎన్నిక కావడం శుభపరిణామమని, గతంలో సిపిఎం శాసనసభా పక్షనేతగా మధిర నియోజకవర్గంలోనే విజయం సాధించిన బోడెపుడి వెంకటేశ్వరరావు, సిపిఐ శాసనసభా పక్షనేతగా ఖమ్మంలో గెలుపొందిన పువ్వాడ నాగేశ్వరరావు వారసునిగా ఆయన ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అసెంబ్లీలో ఎండగడుతారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.