ఖమ్మం

ఇది ఎంపీ అడ్డా...ఆయన ప్రకటించిన వారే అభ్యర్థి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్లూరు, జనవరి 16: ఇది (కల్లూరు మేజర్ గ్రామపంచాయతి) ఎంపీ అడ్డా ...ఇక్కడ మరెవరూ లేరు...ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించిన టిఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థి లక్కినేని నీరజను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా నాయకులు మట్టా దయానంద్ పేర్కొన్నారు. బుధవారం కల్లూరులో టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు లక్కినేని రఘు ఇంటిలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో దయానంద్ మాట్లాడుతూ తమపై వస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టారు. రెండు జిల్లాలను రాజకీయంగా శాసించగలిగేది ఎంపి పొంగులేటి మాత్రమేనని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో కల్లూరు అతి పెద్ద పంచాయతీ అని, సొంత డబ్బు ఖర్చు పెట్టి గతంలో అభివృద్ధి పనులెన్నో నిర్వహించిన ఘనత లక్కినేని రఘుకు ఉందన్నారు. కల్లూరును మరింత అభివృద్ధి చేసేందుకు లక్కినేని నీరజను గెలిపించే బాధ్యత అందరిపై ఉందని అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం లక్కినేని రఘు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో పిడమర్తి రవికి పడ్డ ఓట్లన్నీ ఎంపీ వర్గానివేనని అన్నారు. పిడమర్తి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని అన్నారు. నియోజకవర్గంలో శాసనసభ ఎన్నికల్లో పిడమర్తి ఓడి పోతారని అందుకు ఓట్లు పడని గ్రామాల పేర్లతో సహా ముందే కెటిఆర్, కెసిఆర్‌కు వివరించామన్నారు. పిడమర్తి ఓడి పోయే విషయం కెసిఆర్‌కు ముందే తెలిసి రవిని హెచ్చరించారని, అయినా పిడమర్తి ప్రజలతో మమేకం కాకపోవటం వల్ల ఓడి పోయారన్నారు. పిడమర్తి తమపై చేస్తున్న ప్రచారాలన్నీ అబద్దాలని వివరించారు. ఎంపీ పొంగులేటి తన నిధులతో అనేక అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. గతంలో సర్పంచ్‌గా ఉన్నప్పుడు తాము అనేక అభివృద్ధి పనులు చేశామని మళ్లీ ఇంకా అభివృద్ధి చేసేందుకు నీరజని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనుచరులు, రైల్వే బోర్డు సభ్యులు కీసర వెంకటేశ్వరరెడ్డి, మేకల కృష్ణ, భరోతు రాము నాయక్ ఆ పార్టీ నుండి పోటీ చేసే వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.