ఖమ్మం

సర్పంచ్ స్థానాలకు 136, వార్డులకు 585 నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలూరుపాడు, జనవరి 19: మండలంలో మూడవ విడతగా 24 గ్రామ పంచాయతీలు, 198 వార్డులకు జరుగనున్న ఎన్నికలకు గాను నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. సర్పంచ్ స్థానాలకు 136 మంది, వార్డులకు 585 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు తొలిరోజు కనుమ కావటంతో శుభ గడియలను పరిగణనలోకి తీసుకునే నేతలు మండలంలో ఒక్క చోట కూడా నామినేషన్లను వేయలేదు. రెండవ రోజు గురువారం సర్పంచ్ స్థానాలకు 55, వార్డులకు 227 నామినేషన్లు దాఖలుకాగా చివరి రోజున సర్పంచ్ స్థానాలకు 81, వార్డులకు 358 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పర్వంలో సైతం ఆయా నామినేషన్ స్వీకరణ కేంద్రాల వద్దకు పలు రాజకీయ పార్టీల నాయకులు ర్యాలీగా చేరుకుని ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ప్రయత్నించారు. అధికార టిఆర్‌ఎస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ వర్గం, ప్రస్తుత ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, ఎంపి వర్గానికి చెందిన నాయకులు పలు గ్రామాల్లో ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నారు. వీరితోపాటు కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఎం, సిపిఐ, భారతీయ జనతాపార్టీ, ఎన్‌డి పార్టీలు ఆ పార్టీలకు ఓటు బ్యాంకు ఉన్న చోట ఆయా పార్టీలు విజయం కోసం పోత్తులు పెట్టుకుని తమ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి. గ్రామ పంచాయతీలపై ఆధిపత్యం కోసం నాయకులు దృష్టి సారించటం రోజుల తరబడి సమాలోచనలు సాగించినా పంచాయతీల్లో ఏకాభిప్రాయాలు కుదరలేదనే ప్రచారం సాగుతోంది. శంభునిగూడెం, గాంధీనగరం, నల్లబండబోడు, లైన్‌తండా, భీమ్లాతండా, కొత్తూరు, అన్నారుపాడు, గుండ్లరేవు, సాయిరాంతండా వంటి పలు చిన్న గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం జరుగుతాయని ముందుగా ప్రచారం సాగినా ఆచరణకు నోచుకోలేదు. అయితే నామినేషన్ల ఉప సంహరణ గడువు తేదీ నాటికి నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ఎక్కడైనా ఉప సంహరించుకుంటారా అనేది వేచి చూడాల్సి ఉంది.