ఖమ్మం

కారు జోరుకి హస్తం బేజారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూసుమంచి, జనవరి 22: మండల వ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికల పలితాలలో కారు దూసుకెళ్ళగా హస్తం డీలా పడింది. మండలంలోని మొత్తం 41గ్రామ పంచాయతీలలో టిఆర్‌ఎస్ పార్టీ-24, కాంగ్రెస్ పార్టీ-12, సిపిఎం-3, టిడిపి-1, ఇండిపెండెంట్-1 గెలుచుకున్నాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాలు మండల వ్యాప్తంగా ఉహకు విరుద్ధంగా అంచనాలు తలకిందులు చేస్తూ టిఆర్‌ఎస్ పార్టీకి భారీగా గ్రామ పంచాయతీలు గెలుచుకుంది. తొలుత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగినప్పటికీ పంచాయతీ ఎన్నికలలో సీన్ రివర్స్ అయ్యింది. మండల వ్యాప్తంగా ఓటమిపై కాంగ్రెస్ పార్టీ విశే్లషణలు జరుపుతుంది. గెలిచిన ఆనందంలో టిఆర్‌ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటుండగా ఓటమిపై కాంగ్రెస్ పార్టీ విశే్లషణలు జరుపుతుంది. మండల వ్యాప్తంగా కైవసం చేసుకున్న స్థానాలు టిఆర్‌ఎస్ పార్టీ గెలిచిన స్థానాలు అగ్రహరం -బుర్ర ఆంజనేయులు, ఆజ్మీర హీరామన్ తండ - మూడు కోటు, సంద్యతండ - బాణోత్ ఉపేందర్, చేగోమ్మ - రెడ్డిమల్ల రమణమ్మ, చౌటపల్లి- దామళ్ళ మమత, గైగోళ్ళపల్లి - శ్యాంసుందర్‌రెడ్డి, గంగబండతండ - బాణోత్ కిషన్, గోరీలాపాడు తండ - బాణోత్ సరస్వతి(ఏకగ్రీవం), గురవాయిగూడెం - కుంభం రమ, జక్కేపల్లి - నల్లబోలు మాధవి, జక్కేపల్లి ఎస్‌సికాలని - రాయబారపు స్వాతి, జీళ్ళచెరువు - కొండ సత్యం, జుజ్జులరావుపేట - మందడి పద్మ, కేశవాపురం - తాళ్ళూరి వెంకటేశ్వరరావు, కూసుమంచి - చెన్న మోహన్, లింగారంతండ - బాణోత్ నాగేశ్వరరావు, లోక్యాతండ - జర్పుల పద్మ, మల్లాయగూడెం - బదావత్ బిబ్లి, మంగలితండ - తేజావత్ రాములు, మునిగేపల్లి - గుగ్గిళ్ల మోహన్, ముత్యాలగూడెం - బొల్లికొండ శ్రీను, నాయకన్‌గూడెం - కాసాని సైదులు, నర్సింహుల గూడెం - జక్కుల వెంకటేశ్వర్లు, పెరికసింగారం -వాసంశెట్టి వెంకన్న, రాజుపేట బజార్ - మండవ వెంకటేశ్వర్లు, తురకగూడెం - కనె్నబోయిన కౌసల్య, కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన స్థానాలు భగవత్‌వీడు - బర్మావత్ రవి, బోడియాతండ - భుక్యా రాణీ, ఈశ్వరమాధారం - ఎర్రబోలు సూర్యనారాయణరెడ్డి, గట్టుసింగారం - నెల్లూరి ఖాదర్‌బాబు, కిష్టాపురం - పందిరి పద్మ, కోక్యాతండ - బాణోత్ మంగమ్మ, కొత్తూరు - లోడిగ కృష్ణవేణి(ఏకగ్రీవం), దర్మాతండ - జర్పుల పింప్లి(ఏకగ్రీవం), లాల్‌సింగ్‌తండ - ధరావత్ వెంకటి, పోచారం - రామసహాయం శశికళ, రాజుపేట - వాసంశెట్టి అరుణ, సిపిఎం పార్టీనుండి గెలుపొందిన స్ధానాలు మల్లేపల్లి - పోట్టపింజర నాగేశ్వరరావు, నేలపట్ల - రెంటాల ధనమ్మ, పాలేరు - యడవల్లి రమణమ్మ, టీడీపి నుండి ఎర్రగడ్డతండ - జర్పుల శ్రీనులు గెలుపొందారు.