ఖమ్మం

ఎట్టకేలకు ఈనామ్‌కు అంగీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 22: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఎంతోకాలంగా మిర్చి పంటను కూడా ఈనామ్ పద్ధతి ద్వారా కొనుగోలు చేసేందుకు మార్కెట్ శాఖాధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మిర్చి కొనుగోళ్ళను ఈనామ్ పద్ధతి ద్వారా ఈసీజన్ నుండి ప్రారంభించేందుకు వ్యాపారులతో గత నెల జరిపిన చర్చలు ఫలించలేదు. చివరిగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఆయేషా మస్రత్‌ఖానం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో వ్యాపారులు అంగీకరించారు. మిర్చి పంట కొనుగోళ్ళలో ఈనామ్ పద్దతి అమలు చేయడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని వ్యాపారులు జెసి ఎదుట విన్నవించుకున్నారు. మార్కెట్‌కు ఒకొక్క రైతు 50నుండి 60మిర్చి బస్తాలు తీసుకువస్తారని, దీనివల్ల ఒకటి, రెండు బస్తాలను మాత్రమే కోసి పంటను పరిశీలించడం జరుగుతుందని, దీని ద్వారా తాము తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు జెసి ఎదుట వాపొయ్యారు. దీంతో జాయింట్ కలెక్టర్ వ్యాపారులు, రైతులతో విడివిడిగా చర్చలు జరిపారు. కాగా ఈ చర్చల్లో ఈనామ్‌ను అమలు చేయడం వల్ల వ్యాపారులకు జరిగే నష్టాలు, లాభాలు ఏమిటని ప్రశ్నించి తెలుసుకున్నారు. అనంతరం ఇదే మాదిరిగా రైతులతో, రైతు సంఘాలతో చర్చించి ఈనామ్ పద్దతి ద్వారా వచ్చే లాభ, నష్టాలను జెసికి వివరించారు. దీంతో జెసి ఈ మిర్చి సీజన్ నుండి ఖచ్చితంగా కొనుగోళ్ళలో ఈనామ్ పద్దతిని అమలు చేయాలని ఆదేశించారు. దీనికి జిల్లా కలెక్టర్ నుండి కూడా ఆదేశాలు వచ్చినట్లు ఆమె తెలిపారు. ఈనామ్ అమలు ద్వారా రైతులకు నష్టాల కంటే లాభాలే అధికశాతం ఉన్నాయన్నారు. ఈనామ్‌ను ఖచ్చితంగా అమలు చేసి రైతులకు లాభాలు చేకూరేలా కృషి చేయాలని వ్యాపారులకు సూచించారు. రైతులు మార్కెట్‌కు తీసుకువచ్చే మిర్చి బస్తాలలో ఎన్ని బస్తాలనైనా కోసి పంటను పరిశీలించుకోవచ్చని, దీనికి ఎటువంటి అభ్యంతరాలు లేవని, ఖచ్చితంగా ఈనామ్ ద్వారా మిర్చిని కొనుగోలు చేయాలని ఆదేశించారు. అనంతరం జెసి మార్కెట్‌లోని మిర్చియార్డును పరిశీలించి అధికారులకు పలు సూచనలు తెలిపారు. ఈ సమావేశంలో మార్కెట్ డిఎంఓ సంతోష్‌కుమార్, అధికారులు మల్లయ్య, బజార్, నర్సింహరావు, ఆంజనేయులతో పాటు రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వర్లు, వ్యాపారులు పాల్గొన్నారు.