ఖమ్మం

రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం రూరల్, జనవరి 22: రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించేందుకు కార్మికలు, అధికారులు కృషి చేయాలని సింగరేణి డైరక్టర్లు ఎస్ శంకర్, ఎస్ చంద్రశేఖర్, భాస్కర్‌రావులు అన్నారు. అన్ని ఏరియాల జీఎంలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో డైరక్టర్లు మాట్లాడారు. ఉత్పత్తి, ఉత్పాదక, ఓబి వెలికితీత, రక్షణ, నాణ్యత, రవాణా గురించి క్షుణ్ణంగా చర్చించారు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ పూర్తి రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని సాధించాలని అధికారులకు సూచించారు. పోటీ మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు నాణ్యతతో కూడిన బొగ్గు ఉత్పత్తిని సాధించాలని అన్నారు. భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తగు చర్యలు తీసుకోవాలని, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలని, ఉత్పత్తి చేసిన బొగ్గును రవాణా చేసేందుకు చర్యలు ప్రారంభించాలని అన్నారు. ఈ సమావేశంలో ఏరియా జీఎం రమణమూర్తి, ఎస్‌ఓ టూ జిఎం నారాయణరావు, ఏరియా ఇంజనీరు దామోదర్, ఏజెంట్ జిపి రావ్, డిజిఎం ఐ ఇ జ్యోతి, జికె వోసి మేనేజర్ కరుణాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఫుట్‌పాత్ వ్యాపారస్థులకు మున్సిపాల్టీ నోటీసులు
పాల్వంచ, జనవరి 22: పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రధాన సెంటర్‌లలో ఫుట్‌పాత్‌పై చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యాపారులకు ఫుట్‌పాత్‌పై వ్యాపారాలను తొలగించాలని గత మూడు రోజుల నుంచి మున్సిపల్ కమిషనర్ ఎస్‌కె షఫీ ఉల్లా నోటీసులను అందజేస్తున్నారు. స్థానిక శాస్ర్తిరోడ్డు, నటరాజ్‌సెంటర్, బీసీఎం జాతీయ రహదారిపై ఉన్న ఫుట్‌పాత్‌పై గత అనేక సంవత్సరాలుగా చిరు వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తుండటంతో ఒక్కసారిగా మున్సిపల్ అధికారులు దుకాణాలను తొలగించాలని నోటీసులు ఇవ్వడంతో వ్యాపారాలు లబోదిబో మంటున్నారు. నోటీసులు ఇచ్చిన మూడు రోజులలో దుకాణాలను తొలగించాలని, లేనిపక్షంలో మున్సిపల్ సిబ్బందిచే దుకాణాలను తొలగిస్తామని హెచ్చరించారు. శాస్ర్తిరోడ్డు, బిసిఎం జాతీయ రహదారిపై గత అనేక సంవత్సరాలుగా రోడ్డువైపు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి అనేక ఫైనాన్స్, ఇతర ఇబ్బందులు ఉన్నాయని, ఒక్కసారిగా దుకాణాలను ఖాళీ చేపిస్తే తమ జీవన పరిస్థితి ఎలా అని మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. చిరు వ్యాపారస్థులకు మున్సిపల్ అధికారులు ప్రత్యామ్నాయంగా దుకాణాలు నెలకొల్పేందుకు స్థలాలను చూపించాలని పలువురు వ్యాపారాలు కోరుతున్నారు. మున్సిపల్ కమిషనర్ మాత్రం రోజు రోజుకు పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలో ప్రజలు అధికమవ్వడంతో పాటు వాహనాలు పెరిగి పోవడంతో పుట్‌ఫాత్‌పై వ్యాపారాలు చేస్తూ వాహనాదారులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. ఏది ఏమైనప్పటికీ చిరు వ్యాపారులు మాత్రం అధికారులు తమ జీవన స్థితిగతులపై దెబ్బతీయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.