ఖమ్మం

గార్ల మండలంలో టీఆర్‌ఎస్ విజయకేతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార్ల, జనవరి 22: పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. గార్ల మండలంలోని 20 గ్రామపంచాయతీల్లో టిఆర్‌ఎస్ పార్టీ తొమ్మిది స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ ఏడు, స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు, న్యూడెమోక్రసీ పార్టీ ఒక్క స్థానంలో సర్పంచులను గెలుకున్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు జరిగిన ఎన్నికల కౌంటింగ్‌లో గెలిచిన అభ్యర్థుల జాబితాను మండల పరిషత్ అభివృద్ధి అధికారి డి శిరీష మంగళవారం వెల్లడించారు. అత్యధిక మెజార్టీతో సీతంపేట పంచాయతీ సర్పంచ్ బానోతు లావణ్య గెలుపొందగా మూడు ఓట్లతో గోపాలపురం పంచాయతీ సర్పంచ్ భూక్య భారతి గెలుపొందారు. మిగిలిన స్థానాల్లో బాలాజీతండాలో రత్నాకర్ శంకర్(కాంగ్రెస్)232ఓట్లు, బియ్యారం తండాలో బానోతు ప్రవళిక(టిఆర్‌ఎస్)400 ఓట్లు, చిన్న బంజరలో ఉష (టిఆర్‌ఎస్)308 ఓట్లు, చిన్నకిష్టాపురంలో గంగావత్ రుక్మిణి (టిఆర్‌ఎస్)424 ఓట్లు, కోట్యానాయక్‌తండాలో బానోతు శ్రీను (కాంగ్రెస్)384 ఓట్లు, మద్దివంచలో కుసిని బాబురావు (న్యూడెమోక్రసీ)361 ఓట్లు, మర్రిగూడెంలో భూక్య బుజ్జి( కాంగ్రెస్)962 ఓట్లు, ముల్కనూరులో వట్టం జానకీరాణీ (టిఆర్‌ఎస్)946 ఓట్లు, పెద్దకిష్టాపురంలో గంగావత్ కుంతి (స్వతంత్ర)863 ఓట్లు, పోచారంలో భూక్య మోతీలాల్(టిఆర్‌ఎస్)888 ఓట్లు, పుల్లూరులో మలోతు జ్యోతి (కాంగ్రెస్) 775 ఓట్లు, రాజుతండాలో భూక్య రాంబాయి (కాంగ్రెస్)303 ఓట్లు, రాంపురంలో గుగులోతు తారాబాయి (కాంగ్రెస్)326 ఓట్లు, శేరిపురంలో ధారవత్ సక్రు(స్వతంత్ర) 367ఓట్లతో విజయం సాధించారు. కాగా గార్ల మేజర్ గ్రామపంచాయతీలో అజ్మీరా బన్సీలాల్, పినిరెడ్డిగూడెంలో నునావత్ జ్యోతిలు టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులుగా, బుద్దారం పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ నుంచి భూక్య కమిలి, సత్యనారాయణపురంలో స్వతంత్ర అభ్యర్థి బాదావత్ రాందాస్‌లు ఎన్నికల బరిలో నిలువగా గ్రామస్థులంతా సంఘటితమైన ఏకగ్రీవం చేసుకున్నారు. కాగా ఉపసర్పంచ్ పదవుల ప్రక్రియను పూర్తి చేసినట్లు ఎంపిడిఓ శిరీష తెలిపారు.