ఖమ్మం

మధిర మండలంలో 4 పంచాయతీలు ఏకగ్రీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధిర, జనవరి 22: మధిర మండలంలో 4 గ్రామపంచాయతీల సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలోని అల్లీనగరం గ్రామపంచాయతీ సర్పంచ్, 8వార్డులకు ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో ఈ పంచాయతీ నామినేషన్ల ఉపసంహరణకు ముందే ఏకగ్రీవం అయింది. ఈ పంచాయతీ సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి గోసు చిన్నవేలాద్రిని ఏనుకొన్నారు. అదే విధంగా ఖమ్మంపాడు సర్పంచ్ స్థానానికి 2 నామినేషన్లు రాగా 2వ నామినేషన్ వేసిన అభ్యర్థి ఉపసంహరించుకోవడంతో టిఆర్‌ఎస్ బలపరిచిన దొండపాటి రుక్మిణమ్మతోపాటు 10 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆత్కూరు సర్పంచ్ స్థానానికి 7 నామినేషన్లు రాగా మిగిలిన 6గురు ఉపసంహరించుకోవడంతో అబ్బూరి సంధ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వార్డులకు నామినేషన్లు వేసిన వారు కూడా ఉపసంహరించుకోవడంతో వార్డులు కూడా ఏకగ్రీవం అయ్యాయి. రామచంద్రాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి 3 నామినేషన్లు రాగా ఇద్దరు ఉపసంహరించుకోవడంతో టిఆర్‌ఎస్ బలపరిచిన మార్త నరసింహరావుతోపాటు 8 మంది వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయింది. మండలంలో మొత్తం 27 గ్రామపంచాయతీలు, 236 వార్డులు ఉండగా అందులో 4 గ్రామపంచాయతీలు, 36 వార్డులు ఏకగ్రీవం కావడంతో 23 పంచాయతీలకు, 200 వార్డులకు ఈ నెల 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.

బడ్జెట్‌లో ఆర్టీసికి 1శాతం నిధులు కేటాయించాలి
* ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్టక్రార్యదర్శి గడ్డం లింగమూర్తి
ఖానాపురంహవేలి, జనవరి 22: రాష్టబ్రడ్జెట్‌లో ఆర్టీసి రక్షణ, అభివృద్ధికోసం ఒక శాతం నిధులు కేటాయించాలని స్ట్ఫాఅండ్ వర్కర్స్ పెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర కార్యదర్శి గడ్డం లింగమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక బస్‌డిపో ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రజారంగం ఆర్టీసిని రక్షించి అభివృద్ధిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఆర్టీసి కార్మికుల వేతన ఒప్పంద సవరణ, సర్వీస్ రక్షణ ఒప్పందం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన ఆర్టీసి అనేక రకాలుగా నష్టం చవిచూస్తుందన్నారు. ఆర్టీసికి టోల్‌టాక్స్‌ల నుండి మినహాయింపు ఇవ్వాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డిజిల్, విడిభాగాల ధరలను ప్రభుత్వమే భరించాలన్నారు. ప్రభుత్వం వివిధ వర్గాలకు ఇస్తున్న రాయితీలను బడ్జెట్‌లో కేటాయించి ప్రతి నెలా ఆర్టీసికి చెల్లించాలని డిమాండ్ చేశారు. తార్నాక అసుపత్రిలో దళారి వ్యవస్థను అరికట్టి నాణ్యమైన మందులను అందించడంతో పాటు సూపర్‌స్పెషాల్టి అసుపత్రిగా అభివృద్ధి పర్చాలని కోరారు. కార్మికులపై పడుతున్న పనిభారాన్ని తగ్గించాలన్నారు. అన్ని కేటగిల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి గుండుమాధవరావు, రీజియన్ అధ్యక్షుల యర్రంశెట్టి వేంకటేశ్వర్లు, ప్రచార కార్యదర్శి తోకల బాబు, డిపోకార్యదర్శి పిట్టల సుధాకర్ నాయకులు గుర్రం రామారావు, బొక్క నాగిరెడ్డి, నెల్లూరి బాస్కర్, విజయలక్ష్మీ, జ్యోతి, విజయనిర్మల, తోటకూర శ్రీనివాసరావు, వీరభద్రం, కొలిపాక శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.