ఖమ్మం

సీతారామ పనులను వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశ్వాపురం, జనవరి 23: సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం మండల పరిధిలోని భీమునిగుండం కొత్తూరు వద్ద నిర్మాణంలో ఉన్న సీతారామ ప్రాజెక్టు పంపుహౌస్ ఫేజ్-1 పనులను ఆమె పరిశీలించారు. అధికారులతో కలిసి ఆమె పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల ప్రదేశం వద్ద మ్యాప్‌ను అధికారులతో కలిసి పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టు ఫేజ్-1 పంపుహౌస్ పనుల పురోగతి తదితర వివరాలను అక్కడి ఇంజనీర్ల ద్వారా అడిగి తెలుసుకొని వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం మోటార్ల ఫ్లోస్లాబ్ లెవన్ నిర్మాణం జరుగుతుందన్నారు. వచ్చే మార్చి లోగా పనులు పూర్తి చేసుకొని ట్రయిల్ రన్ నిర్వహించాలన్నారు. ఆరు మోటార్లకు రెండు సిద్ధంగా ఉన్నాయన్నారు. మరో 2 ఈ నెలాఖరుకు, మిగిలినవి మార్చిలోగా వస్తాయన్నారు. మార్చిలో పంపుహౌస్ ద్వారా గోదావరి జలాలను సరఫరా చేయగలమని చెప్పారు. ఈ ఏడాది జూన్ నాటికి గోదావరి జలాలు పాలేరుకు చేరుకోవాలని ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. పనులను వేగవంతం చేయాలని ఆమె అధికారులకు సూచించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. పనుల పురోగతిపై ముఖ్యమంత్రికి నివేదిక సమర్పిస్తామన్నారు. ఇంజనీరింగ్ విభాగం అధికారులు స్మితా సబర్వాల్‌కు సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులపై సమగ్రంగా వివరించారు. అనుకున్న సమయానికి కచ్ఛితంగా పనులను పూర్తి చేస్తామని అధికారులు ఆమెతో చెప్పారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఎస్.చంద్రవౌళి, మురళీధర్‌రెడ్డి, పెంటారెడ్డి, ఎం.శ్యాంప్రసాద్‌రెడ్డి, శ్రీ్ధర్ శేష్ పార్థే, జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ, సబ్‌కలెక్టర్ భవేశ్‌మిశ్రా, సీతారామ ప్రాజెక్టు ఖమ్మం సీఈ వి.సుధీర్, ఎస్‌ఈ బాబూరావు, తహశీల్దార్ అరుణ, పలువురు అధికారులు పాల్గొన్నారు. సీతారామ ప్రాజెక్టు పంపుహౌస్ నుంచి తుమ్మల చెరువుకు గోదావరి జలాలు సరఫరా చేయాలని ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, మొండికుంట సర్పంచి మర్రి మల్లారెడ్డి, పలువురు రైతులు ఈ సందర్భంగా సబర్వాల్‌కు వినతిపత్రం సమర్పించారు.