ఖమ్మం

80 పంచాయతీలు ఏకగ్రీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 23: మూడు విడతలుగా జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో 80గ్రామపంచాయతీ సర్పంచ్‌లు ఏకగ్రీవం అయ్యాయి. ఖమ్మం జిల్లాలో మూడు విడతలుగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో 80గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా అందులో అధికభాగం టిఆర్‌ఎస్ ఖాతాలోకే వెళ్ళాయి. జిల్లాలో 584గ్రామ పంచాయతీలు ఉండగా తొలివిడత ఎన్నికలు జరిగిన 6మండలాల పరిధిలో 21, రెండోవిడత ఎన్నికలు జరుగనున్న 7మండలాల పరిధిలో 35, మూడవ విడత ఎన్నికలు జరుగనున్న 7మండలాల పరిధిలో 24పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అత్యధికంగా 12గ్రామపంచాయతీలు రఘునాధపాలెం మండలంలో ఏకగ్రీవం కావడం విశేషం. ఈ మండలం టిఆర్‌ఎస్ శాసన సభ్యులు పువ్వాడ అజయ్‌కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గ పరిధిలో ఉన్నవి.
ఏకగ్రీవమైన గ్రామాల వివరాలు ఇలా ఉన్నాయి. ముదిగొండ మండల పరిధిలోని గోకినేపల్లి, మేడేపల్లి, నేలకొండపల్లి మండలంలోని శంకరగిరితండ, ముజ్జుగూడెం, అప్పల నర్సింహపురం, తిరుమలాపురంతండా, సుర్దేపల్లి, తిరుమలాయపాలెం మండలంలోని ఇస్లావత్‌తండ, సోలిపురం, గోల్‌తండ, ఖమ్మం రూరల్ మండలంలోని తెల్దార్‌పల్లి, కామేపల్లి మండలంలోని పాతలింగాల, తాళ్ళగూడెం, కొత్తలింగాల, లాల్యతండ, ముచ్చెర్ల, రుక్వితండ, జాస్తీపల్లి, కూసుమంచి మండలంలోని కొత్తూరు, గోరీలపాడుతండ, ధర్మాతండ, ఏన్కూరు మండలంలోని జన్నారం, రాయమాధారం, పికెబంజర, ఎర్రబోడుతండ, సూర్యతండ, తల్లాడ మండలంలోని మల్సూర్‌తండ, తల్లాడ, కల్లూరు మండలంలోని పుల్లయ్యబంజర, లోకారం ఈస్ట్, పెద్దకోరుకొండి, ఒబుల్‌రావుబంజర, కొర్లగూడెం, నారాయణపురం, లింగాల, పాయపూర్, పెనుబల్లి మండలంలోని ఎడ్లబంజర, టేకులపల్లి, కొత్తలంకపల్లి, రామచంద్రాపురం, లంకపల్లి, భవన్నపాలెం, పార్ధసారధిపురం, గౌరారం, సత్తుపల్లి మండలంలోని గంగారం, రామగోవిందాపురం, తాళ్ళమడ, సదాశివునిపాలెం, గౌరిగూడెం, వేంసూరు మండలంలోని భరణిపాడు, భీమవరం, చౌడవరంతండ, కారేపల్లి మండలంలోని టేకులగూడెం, కొత్తతండ, పాతకమలాపురం, గంగారంతండ, వైరా మండలంలోని లింగన్నపాలెం, నారపునేనిపల్లి, ఎర్రుపాలెం మండలంలోని రామాపురం, మధిర మండలంలోని ఆత్కూరు, అల్లీనగరం, కమ్మంపాడు, రామచంద్రాపురం, చింతకాని మండలంలోని రాఘవాపురం, రఘునాధపాలెం మండలంలోని బడ్యాతండ, దొనబండ, జికె బంజర, మంగ్యాతండ, హరియతండ, కొర్లబఓడుతండ, కోయచెలక, లచ్చీరాంతండ, ఎన్‌వి బంజర, పుటానీతండ, రాములుతండ, శివాయగూడెం, కొణిజర్ల మండలంలోని మేకలకుంట, మల్లుపల్లి, ఉప్పలచెలక, లింగగూడెం గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవం అయ్యాయి.