ఖమ్మం

ఇంటర్ పరిక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, ఫిబ్రవరి 20: ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ కమిషనర్ ఎ అశోక్ అదేశించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ వై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని కమిషనర్‌కు వివరించారు. ఈ నెల 27 నుండి మార్చి 13వ తేదీ వరకు జరిగే ఇంటర్ పరీక్షలకు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన మంచినీటి సౌకర్యం, వైద్య సౌకర్యం అందుబాటులో ఉంచుతామన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 గం. నుండి 12 గం.ల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చర్యలు చేపడతామన్నారు. పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, నిర్వహణకు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసి వేసేలా చర్యలు చేపట్టాలని తాహశీల్దార్లను ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు ఈ నెల 22న పరీక్షల నోడల్ అధికారుల కార్యాలయంలో చీఫ్ సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహిస్తామన్నారు. పరీక్షల నిర్వహణపై అధికారులందరినీ అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఇంటర్ నోడల్ అధికారి జహీర్ అహ్మద్, జిల్లా అడిషనల్ ఎస్‌పి ఉదయ్‌కుమార్, ఆర్టీసి డివిఎం వి కృష్ణ, తదితర అధికారులు వి వెంకటేశ్వర్లు, సులోచన పాల్గొన్నారు.