ఖమ్మం

వ్యవసాయ రుణాలకు ఆసరా పింఛన్లు నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశ్వాపురం, మార్చి 14: వ్యవసాయ రుణ బకాయిలను రాబట్టుకునేందుకు బ్యాంకర్లు ఆసరా పింఛన్లను నిలిపివేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. దిగుబడులు సక్రమంగా లేక, పంట దిగుబడులు రాక కష్టాల కడలిలో ఉన్న రైతులు పంట రుణాలను పూర్తిస్థాయిలో చెల్లించడం లేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రూ.లక్ష వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని హామీనిచ్చింది. తిరిగి అధికారంలోకి రావడంతో ప్రభుత్వ సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. బ్యాంకర్లు మాత్రం రుణాల రికవరీ పేరుతో తమ బ్యాంకుల్లో పింఛన్ పొందుతూ వ్యవసాయ రుణాలు బకాయి ఉన్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళల పింఛన్లు నిలిపి వేస్తున్నారు. జిల్లాస్థాయిలో పలు బ్యాంకుల్లో ఈ తతంగం నడుస్తోంది. అశ్వాపురం మండలం మొండికుంట ఆంధ్రా బ్యాంకుల్లో వ్యవసాయంపై ఆధారపడి ఉన్న రైతుల ఖాతాలు ఎక్కువగా ఉన్నాయి. మండలంలో ప్రధాన సాగునీటి వనరు తుమ్మలచెరువు ఆయకట్టు కింద 10వేల ఎకరాల్లో వరిపంట సాగవుతోంది. మొండికుంటలోని ఆంధ్రాబ్యాంకులో రైతులు ఎక్కువగా రుణాలు తీసుకున్నారు. రుణాల రికవరీలో భాగంగా బ్యాంకు అధికారులు వారికి రావాల్సిన పింఛన్లు ఇవ్వకుండా రుణ బకాయి కింద నిలిపివేస్తున్నారు. మొండికుంట ఆంధ్రాబ్యాంకులో తమకు ఐదు నెలల నుంచి పింఛన్ నిలిపివేసినట్లు పలువురు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీసుకున్న రుణాలు చెల్లించలేక, పింఛన్లు రాక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, బ్యాంకర్లు స్పందించి వ్యవసాయ రుణ బకాయిలకు పింఛన్ నిలిపి వేయకుండా చూడాలని బాధితులు కోరుతున్నారు.