ఖమ్మం

ప్రశ్నించే గొంతుకను శాసనమండలికి పంపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), మార్చి 14: ప్రశ్నించే గొంతుకను శాసన మండలికి పంపినప్పుడే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి దోహదపడతాయని టిపిటిఎఫ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి వి మనోహర్‌రాజు అన్నారు. గురువారం ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై జరిగిన క్యాంపెయిన్ ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్బావిస్తే విద్యారంగం అభివృద్ధి చెందుతుందని భావించిన ఉపాధ్యాయులకు నిరాశే మిగిలిందన్నారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం విద్యకు బడ్జెట్‌లో దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే 6.71శాతం మాత్రమే కేటాయించిన దీనిపై మాట్లాడే ఎమ్మెల్సీ లేరన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు విరుద్దంగా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్‌ను రద్దు చేసినా, సిపిఎస్‌ను రద్దు చేయకున్న, పదవి విరమణ వయస్సు 61సంవత్సరాలకు పెంచుతామని అనేక వాగ్ధనాలు చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం దాని అమలులో తాత్సారం చేస్తున్న పట్టించుకునే వారు లేరన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుండా కాలం గడుపుతున్న ప్రభుత్వం ఉపాధ్యాయుల తరఫునా ఎన్నికైన ఏ ఒక్క ఎమ్మెల్సీ కూడా ప్రశ్నించకుండా, సొంత పనులు చేసుకుంటూ వారి కోసమే పనిచేస్తున్నారన్నారు. అలాంటి వారు మరలా గెలిచినా ఉపాధ్యాయులకు ఓరిగేది ఎమీ లేదన్నారు. ఉద్యోగుల సమస్యలపై మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించగల వ్యక్తులను గెలిపించుకోవల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉపాధ్యాయునిపై ఉందన్నారు. ఎంతో కాలంగా పెండింగ్ ఉన్న ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడి సాధించే పట్ట్ధుల ఉన్న వ్యక్తిని గెలిపించుకోవాలన్నారు. యుఎస్‌పిసి ఉమ్మడి అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి వంటి ప్రశ్నించే గొంతుకను శాసన మండలికి పంపినప్పుడే ఉపాధ్యాయ ఉద్యమానికి ఉపయోగపడతారన్నారు. అలాంటి వ్యక్తికి ఉపాధ్యాయులు ప్రధమ ప్రాధాన్యతతో ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్, టిఎస్‌యుటిఎఫ్ జిల్లా నాయకులు ఎం నాగిరెడ్డి, పి నాగేశ్వరరావు, రమాదేవి, డి రమేష్, ఉపాధ్యాయులు బాలాజీ, అంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.