ఖమ్మం

సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, మార్చి 14: సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్దేశించిన లక్ష్యంలో పనులు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రిన్సిపుల్ సెక్రటరీ ఎస్ నర్సింగరావు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ భూపాల్‌రెడ్డిలు అన్నారు. గురువారం సీతారామ ప్రాజెక్టు స్టేజి-2 పంపునిర్మాణ పనులు జరుగుతున్న ములకలపల్లి మండలం ఒడ్డురామవరం, కమలాపురం వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణ పనుల రోజువారీ నివేదికను అందజేయాలని, నిర్మాణ పనులలో నిర్లక్ష్యాన్ని సహించేదిలేదని హెచ్చరించారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్దేశించుకున్న సమయంలో పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన 3800 ఎకరాల అటవీభూములకు సంబంధించిన అన్నిరకాల అనుమతులు లభించిన దృష్ట్యా పనులను వేగవంతం చేయాలని అన్నారు. నిర్మాణ పనులకు సంబంధించి సిబ్బందిని అదనంగా నియమించడం, యంత్రాలను మరిన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ పనులు పూర్తి జరిగాయని అన్నారు. రైతుల భూములను, అటవీభూముల సేకరణ పూర్తి చేసిన్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనులను పూర్తిచేయాలని కోరారు. రానున్న జూలై, ఆగస్టు నెల నాటికి నాగార్జునసాగర్ కాలువకు సీతారామ ప్రాజెక్టును అనుసంధానం చేయాల్సివుందన్నారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. రైతుల భూములు సాగుచేసుకునేవిధంగా నీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్‌డి (హరితహారం) ప్రియాంకవర్గీస్, జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌షైనీ, ఇరిగేషన్ ఓఎస్‌డి దేశ్‌పాండే, సిఇ సుధాకర్‌రావు, ఎస్‌ఇ నాగేశ్వరరావు, ఇరిగేషన్ ఎఇ వెంకటేశ్వరరావు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.