ఖమ్మం

ఖమ్మంలో 3ప్రైవేట్ ఆసుపత్రులు సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), ఏప్రిల్ 9: నిబంధనలు అతిక్రమించి నిర్వహిస్తున్న మూడు ప్రైవేట్ ఆసుపత్రులను సీజ్‌చేశారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కళావతిబాయి తమ సిబ్బందితో నగరంలోని ప్రైవేటు ఆసుపత్రులపై దాడులు నిర్వహించారు. కోవెల ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించగా అర్హతలేని డాక్టర్ లేకుండా ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. ఆసుప్రతిలో ఆర్‌ఎంపి వైద్యులుగా వ్యవహరిస్తూ ఆసుపత్రి నిర్వహించడంపై ఆయన మండిపడ్డారు. తమ సిబ్బందితో ఆసుపత్రిని మూసివేశారు. అనంతరం విజయాడెంటల్ ఆసుపత్రి, శ్రీనివాస చర్మవ్యాధుల ఆసుపత్రులను తనిఖీచేశారు. ఇక్కడ కూడా నిబంధనలు పాటించకుండా ఆసుపత్రులను నిర్వహిస్తున్నారని తనిఖీలో తేలింది. అర్హతలేని ల్యాబ్ టెక్నీషియన్లు పరీక్షలు నిర్వహించడంపై ఆమె యాజమాన్యాన్ని ప్రశ్నించారు. అనంతరం ఈ రెండు ఆసుపత్రులను కూడా సీజ్ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు పొందినవారే ఆసుపత్రులను నిర్వహించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి డిఎం అండ్ హెచ్‌వో డాక్టర్ మాలతి, సిబ్బంది సాంబశివరెడ్డి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.