ఖమ్మం

‘పాలేరు’ ప్రజల తీర్పు వైవిధ్యభరితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం రూరల్, ఏప్రిల్ 9: పాలేరు నియోజకవర్గంలో 1972 నుంచి 2018 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-8, సిపియం-2, సిపిఐ-1, టిఆర్‌ఎస్-1సారి విజయం సాధించాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తుల శాంతయ్య(1972), పొట్టపింజర హుస్సేను(1978), సంబాని చంద్రశేఖర్(1989,1999,2004), రాంరెడ్డి వెంకటరెడ్డి(2014), కందాళ ఉపేందర్‌రెడ్డి(2018)లు విజయం సాధించారు. సిపియం నుంచి బాజీ హనుమంతు(1985), సండ్ర వెంకటవీరయ్య(1994) విజయం సాధించారు. సిపిఐ నుంచి భీమపాక భూపతిరావు(1983) గెలుపొందారు. 2016లో అప్పటి ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి అకాల మరణంతో జరిగిన బై ఎలక్షన్లలో టిఆర్‌ఎస్ పార్టీ నుంచి తుమ్మల నాగేశ్వరరావు విజయకేతనం ఎగురవేశారు. అయితే పాలేరు తాజా ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్‌ఎస్ పార్టీలో చేరడంతో ఆపార్టీలో మరో ఎమ్మెల్యే జమైనట్లయింది. ఆదినుంచి కాంగ్రెస్ పార్టీకి పాలేరు నియోజకవర్గం కంచుకోటగా నిలిచింది. ఆతరువాత చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల్లో సిపియం, సిపిఐ, టిఆర్‌ఎస్ పార్టీలు కూడా తమ ప్రాతినిధ్యాన్ని చాటుకోవడంతో ‘కాంగ్రెస్ కంచుకోటలో ‘ఎర్ర-గులాబి’’ వికసించింది. 1999లో జరిగిన పాలేరు అసెంబ్లీ ఎన్నికల్లో సంభాని చంద్రశేఖర్, ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో గారపాటి రేణుకాచౌదరి కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. రేణుకాచౌదరికి 3,28,596 ఓట్లు, టిడిపి ఎంపి అభ్యర్థి స్వర్ణకుమారికి 3,20,198 ఓట్లు వచ్చాయి. 2004 ఎన్నికల్లో కూడా సంబాని చంద్రశేఖర్ పాలేరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆదఫాలో జరిగిన ఎన్నికల్లో కూడా రేణుకాచౌదరి టిడిపి ఎంపి అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై విజయం సాధించారు. రేణుకాచౌదరికి 5,18,047 ఓట్లు, నామా నాగేశ్వరరావుకు 4,09,159 ఓట్లు వచ్చాయి. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ హవా బాగుంది. 2009 ఎన్నికల్లో ఖమ్మం ఎంపి టిడిపి అభ్యర్థి నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి రేణుకాచౌదరిపై విజయం సాధించి ఫలితాలను తారుమారు చేశారు. నామా నాగేశ్వరరావుకు 4,69,368 ఓట్లు, రేణుకాచౌదరికి 3,44,920 ఓట్లు వచ్చాయి. అయితే ఈఎన్నికల్లో నామాకు 1,27,653 ఓట్ల మెజార్టీ ఇచ్చి వైవిధ్యభరితమైన తీర్పునిచ్చారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి రాంరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందారు. రాంరెడ్డి వెంకటరెడ్డి అకాల మరణంతో 2016 బై ఎలక్షన్లలో తుమ్మల నాగేశ్వరరావు టిఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. 2014లో జరిగిన ఖమ్మం ఎంపి ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్‌ఆర్‌సిపి నుంచి, నామా నాగేశ్వరరావు టిడిపి నుండి, కంకణాల నారాయణ సిపిఐ నుంచి, బుడాన్ బేగ్ టిఆర్‌ఎస్ పార్టీల నుంచి పోటీ చేశారు. వీరిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 4,21,957 ఓట్లు, నామా నాగేశ్వరరావుకు 4,09,983, కంకణాల నారాయణకు 1,87,653, బుడాన్ బేగ్‌కు89,063 ఓట్లు వచ్చాయి. హోరాహోరీగా జరిగిన ఈఎన్నికల్లో పొంగులేటికి 11,974 ఓట్ల మెజార్టీ వచ్చింది. విచిత్రం ఏమిటంటే ఒక్క సిపిఐ పార్టీకి చెందిన కంకణాల నారాయణ తప్ప ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రస్తుతం ఖమ్మం ఎంపి టిఆర్‌ఎస్ అభ్యర్ధిగా బరిలో నిలిచిన నామా నాగేశ్వరరావు, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షునిగా పనిచేసి టిడిపిలోకి వెళ్ళి తిరిగి నామాతో సొంతగూటికి వచ్చిన షేక్ బుడాన్ బేగ్‌లు అందరూ తెలంగాణ రాష్ట్ర సమితి గొడుగు కిందనే పనిచేయడం గమనార్హం.
కాగా రేణుకాచౌదరి, నామా నాగేశ్వరరావులు ఖమ్మం ఎంపి బరిలో పోటీ చేయడం ఇది నాలుగోసారైనా...ఇద్దరు కలిసి తలపడడం మూడోసారి. అయితే తుమ్మల నాగేశ్వరరావు పాలేరు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినా...2018 ఎన్నికల్లో తుమ్మలను కాదని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కందాళ ఉపేందర్‌రెడ్డికి పట్టం కట్టి ఓటర్లు తమ విలక్షణమైన శైలిని ప్రదర్శించారు.
అయితే ఇటీవల కాంగ్రెస్ పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి టిఆర్‌ఎస్ పార్టీలో చేరడంతో ఆనాయకుడి వెంట కాంగ్రెస్ శ్రేణులు వెళ్తున్నారా లేదా అన్న విషయం అంతుపట్టని ప్రశ్నగా మిగిలింది. రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన పాలేరు ప్రజలు మొదటి నుంచి వైవిధ్యాన్ని కోరుకుంటున్నారనడానికి వారిచ్చిన తీర్పే శిరోధార్యం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తిరుమలాయపాలెం మినహా ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, కూసుమంచి మండలాల్లో కాంగ్రెస్ పార్టీ వైపే ఓటర్లు మొగ్గుచూపారు. ఈనెల 11న జరిగే ఖమ్మం ఎంపి ఎన్నికల్లో ఓటర్లు ఏపార్టీకి పట్టం కడతారో వేచి చూడాల్సిందే.

ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
* జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్
ఖమ్మం(గాంధీచౌక్), ఏప్రిల్ 9: పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేందుకు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు సహకరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ప్రజ్ఞామందిరంలో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థులు, అభ్యర్థుల ఏజెంట్లతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ పోలింగ్ నిర్వహణపై ఏర్పాట్లను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం 5గంటల నుండి ఎన్నికల ప్రచార గడువు ముగుస్తుందని, అభ్యర్థులు, ఏజెంట్లు కేవలం ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకోవచ్చునన్నారు. ఈ నెల 10,11 తేదిలలో బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళీ ఉల్లంఘన కేసులు కనుగోన్నట్లయితే తక్షణమే ఎంసిసి ప్లయింగ్ స్క్వాడ్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. పోలింగ్ చివరి రెండు రోజులు ఎంసిసి ప్లయింగ్ స్క్వాడ్‌లచే 48గంటలు నిరంతరాయంగా విస్తృత తనిఖీలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ స్టేషన్‌కు 100మీటర్ల పరిధిలోపు అంక్షాలు ఉంటాయని, విధిగా పాటించాలని, అభ్యర్థి నియోజకవర్గంలోని ఏదేని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించవచ్చునని, పార్టీ చిహ్నలు కలిగిన కండువాలు, టోపిలు ఇతర ఎటువంటి ప్రచార కార్యక్రమాలను పోలింగ్ కేంద్రానికి పరిధిలో చేపట్టరాదని తెలిపారు. పోలింగ్ రోజు అభ్యర్థితో పాటు అభ్యర్థి ఎజెంట్ వాహనాలకు రిటర్నింగ్ అధికారి అనుమతి పొందాలని, అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఒక వాహనంతో పాటు అభ్యర్థి ఏజెంట్ వాహనాలకు మాత్రమే అనుమతించడం జరుగుతుందని, అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో కేవలం మూడు వాహానాలకు మించి వినియోగించరాదని వివరించారు. దివ్యాంగులకు, వయోవృద్ధులు, గర్బిణీలు, బాలింత ఓటర్లకు ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నామని వెల్లడించారు. పోలింగ్ అనంతరం పోల్డ్ ఇవిఎంలను, అభ్యర్థులు, అభ్యర్థుల ఏజెంట్లు, రాజకీయ పార్టీల సమక్షంలో విజయ ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్‌రూంలకు తరలించటం జరుగుతుందని దీనికి తప్పనిసరిగా హజరుకావలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎక్స్‌పెండిచర్ నోడల్ అధికారి యం రాజు, ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులు, ఎజెంట్లు పాల్గొన్నారు.