ఖమ్మం

89.73 శాతం పోలింగ్ నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 16: పాలేరు ఉప ఎన్నికలో 89.73శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 1,90,351 మంది ఓటర్లకు గాను, 1,77,800 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2014 ఎన్నికల్లో 91.46శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి 2శాతం తక్కువగా నమోదైంది. తిరుమలాయపాలెం మండలంలో 41,157 ఓట్లకు గాను 37,161 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 90.29శాతం పోలింగ్ నమోదైంది. ఖమ్మం రూరల్ మండలంలో 66,732 ఓట్లకు గాను 59,219 ఓట్లు పోలవగా 88.74శాతం పోలింగ్ నమోదైంది. కూసుమంచి మండలంలో 40,426 ఓట్లకుగాను 36,268 ఓట్లు పోలవగా 89.71 శాతం పోలింగ్ నమోదైంది. నేలకొండపల్లి మండలంలో 42,036 ఓట్లకు గాను 38,157 ఓట్లు పోలవగా 90.76శాతం నమోదైంది. నియోజకవర్గంలో నేలకొండపల్లి మండలంలో అత్యధికంగాను, ఖమ్మం రూరల్ మండలంలో అత్యల్ఫంగాను పోలింగ్ నమోదైంది. కాగా పోలింగ్ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన ఓటర్లు మోడల్ బూత్‌లను చూసేందుకు ఆసక్తికనబరిచారు. 3,200 మంది పోలీసుల బందోబస్తు నడుమ జరిగిన ఈ ఎన్నికలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా అత్యంత సమస్యాత్మక గ్రామాలు అయిన ఖమ్మం రూరల్ మండలంలోని తెల్దారుపల్లి, తల్లంపాడు, తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలు, బీరోలు, కూసుమంచి మండల కేంద్రంలోని బూత్‌లను ఎస్పీ రెమా రాజేశ్వరి పరిశీలించారు. ఎన్నికల జనరల్, వ్యయ, పోలీస్ పరిశీలకులు అధిక సంఖ్యలో పోలింగ్ బూత్‌లను పరిశీలించడం విశేషం. అయితే గతానికి భిన్నంగా నియోజకవర్గ పరిధిలో ఎక్కడా భారీ సంఘటనలు జరగకపోవడం పట్ల అధికార యంత్రాంగం ఆనందం వ్యక్తం చేసింది.

వ్యాక్సినేషన్ పరిశీలకుడు
దుమ్ముగూడెం, మే 16: మండలంలోని పిల్లలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వ్యాక్సిన్‌పై కేంద్ర పరిశీలకుడు డాక్టర్ శ్రీ్ధర్ సోమవారం తనిఖీలు చేశారు. నర్సాపురం, పర్ణశాల, దుమ్ముగూడెం పీహెచ్‌సీలను ఆయన తనిఖీ చేశారు. ఇటీవల పిల్లలకు అందించే వ్యాక్సినేషన్ ట్రైవాలెంట్ నుంచి బైవాలెంట్‌గా కేంద్రం మార్చింది. ఆ వ్యాక్సిన్ పనితీరు, పిల్లలకు అందించిన తీరును పరిశీలించారు. ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ నిల్వ తదితర రికార్డులను తనిఖీ చేశారు. ఆయన వెంట డీఐవో వెంకటేశ్వర్లు, అడిషన్ డీఎంహెచ్‌వో పుల్లయ్య, వైద్యులు నరేష్‌కుమార్, రవీందర్, ఉన్నారు.