ఖమ్మం

పాలేరులో నైతిక విజయం సిపిఎందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(కల్చరల్), మే 20: ఇటీవల జరిగిన పాలేరు ఉప ఎన్నిక పోరులో సిపిఎందే నైతిక విజయమని సిపియం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సుందరయ్యభవన్‌లో భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అధ్యక్షతన జిల్లా కార్యదర్శివర్గ, డివిజన్ కార్యదర్శుల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పోతినేని మాట్లాడుతూ అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా ధనప్రవాహం, మోసపూరిత వాగ్ధానాలు, కులతత్వాన్ని ఆసరా చేసుకుని విజయం సాధించారన్నారు. ఈ ఎన్నికల్లో సిపిఎం ప్రజాస్వామ్య పద్దతిలో విలువలతో కూడిన రాజకీయ ప్రచారాన్ని నిర్వహించిందన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఈ ఎన్నికల్లో గెలవాలని సిపిఎం చేసిన సవాల్‌ను ఎవరూ స్వీకరించకపోవడం దారుణమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వామపక్షాలతో కలిసి పోరాటం కొనసాగిస్తామన్నారు.
పాలేరు ఎన్నికలో పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు, అభిమానులకు, ఓటు వేసిన వారందరికి సిపిఎం జిల్లా కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ప్రత్యేకంగా సిపిఎం అభ్యర్థి విజయానికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన సిపిఐ జిల్లా నాయకత్వానికి, కార్యకర్తలకు సమావేశం ధన్యవాదాలు తెలిపింది. ముఖ్యంగా వయో భారాన్ని లెక్కచేయకుండా, మండుటెండలో సైతం ప్రచారాన్ని నిర్వహించిన సిపిఐ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు వౌలానా, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావులకు కృతజ్ఞతలు తెలిపింది. గెలుపోటములతో సంబంధం లేకుండా భవిష్యత్‌లో వామపక్ష ఐక్యతకు కృషి చేస్తామని సిపియం తెలిపింది. ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు బుగ్గవీటి సరళ, పొన్నం వెంకటేశ్వరరావు, కాసాని ఐలయ్య, నున్నా నాగేశ్వరరావు, మచ్చా వెంకటేశ్వర్లు, ఎజే రమేష్, కళ్యాణం వెంకటేశ్వరరావు, అన్నవరపు కనకయ్య, యర్రా శ్రీకాంత్, డివిజన్ కార్యదర్శులు బత్తుల లెనిన్, బండి రమేష్, బొంతు రాంబాబు, మేరుగు సత్యనారాయణ, అన్నవరపు సత్యనారాయణ, తాతా భాస్కర్‌రావు, కాటబోయిన నాగేశ్వరరావు, యలమంచిలి రవికుమార్, యర్రా శ్రీనివాసరావు పాల్గొన్నారు.