ఖమ్మం

జిల్లాలో టిడిపి ఉనికి ‘నామ’మాత్రమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 21: ఆవిర్భావం నుంచి ఖమ్మం జిల్లాలో గట్టిపట్టు కలిగిన తెలుగుదేశం ఉనికి కోసం ప్రయత్నించాల్సిన పరిస్థితి నెలకొన్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో ఆ పార్టీ ప్రధాన నేతలంతా అధికార పార్టీ తీర్థం పుచ్చుకోగా ఉన్న నేతలు జిల్లాపై పూర్తి స్థాయిలో పట్టు సాధించడంలో విఫలమయ్యారు. గతంలో అత్యంత వైభవంగా నిర్వహించిన మినిమహానాడును ఈ సారి అన్ని ప్రాంతాల నుంచి నేతలు లేకుండానే నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో మహానాడుకు వచ్చేందుకు నేతలు పోటీ పడేవారు. ఈ సారి ఎవరో ఒకరు వస్తేచాలు అన్నట్లుగా ఉన్నట్లు సీనియర్ నాయకులు స్పష్టం చేశారు. అప్పట్లో నేతల మధ్య ఉన్న విభేదాలే జిల్లాలో పార్టీ ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు వామపక్షాలతో పొత్తులు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ పార్టీ నేతల మాటను జవదాటకుండా వారికి మద్దతు పలికిన ఘనత టిడిపి శ్రేణులది. రాష్ట్రం ఆవిర్భావానికి ముందు పార్టీ నేతల మధ్య ఉన్న వర్గ విభేదాలతో సొంతపార్టీలోనే ప్రత్యర్థులుగా పనిచేసిన కార్యకర్తలు రాష్ట్ర ఆవిర్భావం అనంతరం నేతల బాటలోనే పయనించారు. గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నేతలు, కార్యకర్తలతో కిటకిటలాడుతూ ఉండేది. కాని ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది. ఒకప్పుడు వర్గాలతో విడిపోయి ఆరోపణలు గుప్పించుకున్న పార్టీలో ఒక వర్గం పూర్తిగా పార్టీని వీడినప్పటికీ సయోధ్య కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఉన్న కొద్ది మంది నేతలు పార్టీని వీడడం, వరుసగా జరిగిన ఎన్నికల్లో ఉనికిని కూడా కాపాడుకోలేకపోవడంతో జిల్లాలోనే టిడిపి పరిస్థితి ‘నామ’మాత్రమే అయింది. పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న నామ నాగేశ్వరరావు వ్యవహరశైలిని ప్రశ్నించి తుమ్మల వర్గీయులు పార్టీని వీడగా ఉన్న నేతల్లో కూడా ఆయన మనోస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేయడంలేదనే విమర్శలు ఉన్నాయి. గతంలో జిల్లాలో నిత్యం పర్యటించే ఆయన ఇప్పుడు ఎన్నికలప్పుడు మాత్రమే వస్తూ పోతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అగ్రనేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశాన్ని వీడి టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఆయనతోనే అధికార పార్టీలో చేరారు. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మణుగూరు ప్రాంతానికి చెందిన తుళ్ళూరి బ్రహ్మయ్యను నియమించారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని కాపాడుకోలేకపోయింది. ఆ తర్వాత జరిగిన ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో 48 డివిజన్‌లలో పోటీ చేసినా ఒక్క డివిజన్ కూడా గెలవకపోగా నాలుగింటిలో మాత్రమే గట్టిపోటీ ఇచ్చింది.
ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన పాలేరు ఉప ఎన్నికల్లో పార్టీ ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. దీంతో అప్పటి వరకు ఆయా గ్రామాల్లో ప్రత్యర్థులుగా ఉన్న వారికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి రావడంతో నేతలు టిఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో పాలేరులో 2014లో టిడిపికి 47వేల ఓట్లు రాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చినా దాని ప్రభావం శూన్యమేనని వెల్లడైంది. దానికి తోడు ఆయా మండలాల్లోని ప్రధాన నేతలు పార్టీని వీడడంతో కనీసం కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసే నాథుడు కరువయ్యాడు. కాగా జిల్లాలో ప్రధాన నేతలంతా పార్టీని వీడితే ఉన్న వారిని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడంలో నాయకత్వం విఫలమైంది. ప్రధానంగా జిల్లా పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న పొలిట్‌బ్యూరో సభ్యుడు నామ నాగేశ్వరరావు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నేతలకు అందుబాటులో ఉండడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన ఆయన ఎన్నికల రోజు తర్వాత మళ్లీ కార్యకర్తలకు కనిపించ లేదు. పాలేరు ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థితో కలిసి అక్కడక్కడా ప్రచారం చేసినా ఆశించిన స్పందన రాలేదు. మరోవైపు పార్టీలో ప్రధాన నేతలుగా ఉన్న స్వర్ణకుమారి తన స్వగ్రామమైన తిరుమలాయపాలెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మెజార్టీ తీసుకురాలేకపోయారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి 371 ఓట్లు రాగా ఇవ్వన్నీ కాంగ్రెస్ ఓట్లేనని తెలుస్తోంది. కనీసం ఆ మండలంలో టిఆర్‌ఎస్ మెజార్టీని కూడా అపలేకపోయారు.
తిరిగొస్తున్న కలెక్టర్, ఎస్పీ
* రేపు విధుల్లో చేరనున్న
లోకేశ్ కుమార్, షానవాజ్
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, మే 21: పాలేరు ఉప ఎన్నిక సందర్భంగా ఇటీవల బదిలీ అయిన జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్, ఎస్పీ షానవాజ్ ఖాసీం తిరిగి ఖమ్మం రానున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లోకేష్‌కుమార్, షానవాజ్ ఖాసీంను బదిలీ చేశారు. ఎన్నికల కోడ్ శుక్రవారంతో ముగియటంతో శనివారం వారిని యథాస్థానాల్లో విధులు నిర్వహించాలని చీఫ్ సెక్రటరీ నుంచి ఉత్తర్వులు అందాయి. ఇక్కడ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న దానకిషోర్‌ను హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఇక్కడ ఎస్పీగా పని చేస్తున్న రమా రాజేశ్వరిని మహబూబ్‌నగర్ ఎస్పీగా బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లోకేష్‌కుమార్, షానవాజ్‌ఖాసీంలు సోమవారం విధుల్లో చేరనున్నట్లు తెలుస్తోంది.