ఖమ్మం

మార్కెట్‌కు పోటెత్తిన మిర్చి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), మార్చి 17: రైతు ఎర్ర బంగారంతో గురువారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కిటకిటలాడింది. మార్కెట్ చుట్టు పక్కల ఏ రోడ్డుకు వెళ్ళినా రైతుల మిర్చి బస్తాలు దర్శనమిచ్చాయి. రైతుల మిర్చి బస్తాలకు కోసం అధికారులు ఏర్పాటు చేసిన ప్రధాన యార్డు, మిర్చి యార్డు నిండడంతో రైతులు బస్తాలను ఎక్కడ దించాలో తెలియక మార్కెట్ చుట్టు ప్రక్కల ఉన్న రోడ్లపై తమ బస్తాలను దింపి అమ్మకాలు జరుపుకున్నారు. సోమ, మంగళ వారాల్లో మార్కెట్‌కు మిర్చి బస్తాలు అధికంగా రావడంతో అధికారులు బుధవారం మిర్చియార్డుకు సెలవు ప్రకటించారు. దీంతో గురువారం రైతులు ఒక్కసారిగా మార్కెట్ యార్డుకు తమ మిర్చిని అమ్ముకునేందుకు బస్తాలను తరలించడంతో లక్ష బస్తాలకు పైగా యార్డుకు చేరాయి. గురువారం రాత్రికే యార్డులోని షెడ్లు, షెడ్ల చుట్టు ప్రదేశం కాలు పెట్టే సందు లేకుండా మిర్చి బస్తాలు నిండిపోవడంతో గురువారం తెల్లవారుజామున రైతులు తీసుకొచ్చిన బస్తాలను యార్డు వెలుపల దింపారు. దీంతో యార్డుకు దాదాపు అర కిలోమీటర్‌పైగా రోడ్లపై రైతులు బస్తాలను దింపి అమ్మకానికి ఉంచారు. రైతుల బస్తాలు యార్డు బయట రోడ్లపై దింపడంతో గాంధీచౌక్, ప్రకాశ్‌నగర్, బోస్‌సెంటర్, కినె్నరసాని రోడ్ల వైపు వచ్చే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
స్థానిక ప్రజలకు ఇబ్బందులు
గురువారం మార్కెట్‌కు లక్షకు పైగా మిర్చి బస్తాలను రైతులు అమ్మకానికి తరలించడంతో దాదాపు 35వేల బస్తాలకు పైగా బయట రోడ్లపైనే దిగుమతి జరిగాయి. దీంతో మార్కెట్ యార్డు చుట్టు ప్రక్కల నివసించే వారు బస్తాలు తమ ఇళ్ల ముందు దిగడంతో ఆ గాటుకు తట్టుకోలేక చాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంట్లోంచి బయటకు రాలేక, బయట నుంచి వస్తున్న గాటుతో అవస్థలు పడ్డారు. రోజు మార్కెట్‌లో నుంచి వచ్చే గాటుతోనే తట్టుకోలేకపోయామని, ఇప్పుడు బస్తాలను తమ ఇళ్ల ముందే దింపడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా రోడ్లపై భారీగా మిర్చి బస్తాలను రైతులు దింపడంతో అధికారులు సైతం తలలుపట్టుకున్నారు.మార్కెట్‌యార్డు చుట్టు ఉన్న రోడ్లపై బస్తాలను రైతులు దింపడంతో వాటిని కాంటాలు వేసి తరలించే సమయంలో వారి వద్ద గెట్ స్లిప్‌లు తీసుకునేందుకు సిబ్బంది సరిపడక ఇబ్బందులు పడ్డారు. వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో బయట దించిన బస్తాలను త్వరగా కాంటాలు వేపించేందుకు అధికారులు వ్యాపారులను అప్రమత్తం చేసి తగిన చర్యలు తీసుకున్నారు.