ఖమ్మం

ఐటీసీ తీరుపై గిరిజన సంఘాల గుర్రు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, మే 22: అత్తసొమ్ము అల్లుడి దానం అంటే ఇదేనేమో ఐటీసీ వదిలే వ్యర్థాలతో పంట పొలాలు, ఆరోగ్యం నాశనం చేసుకున్న గ్రామాలను వదిలి అసలు కర్మాగారానికే సంబంధం లేని మరో గ్రామానికి ఆ కంపెనీ రూ.2కోట్లను దారాదత్తం చేసింది. దీనిపై గిరిజన సంఘాలు గుర్రుగా ఉన్నాయి. ఇటీవలే జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఐటీసీ యాజమాన్యం తీరుపై భద్రాచలంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాచలంకు ఏటా రూ.25 లక్షలను వౌలిక సదుపాయాల కల్పనకు విడుదల చేయాల్సిన ఐటీసీ గత 8 ఏళ్లుగా ఆ సంప్రదాయానికి పాతర వేసిందని కలెక్టర్ లోకేశ్‌కుమార్‌కు మంత్రి వివరించారు. ఇది జరిగి కొద్ది రోజులు కూడా కాలేదు అపుడే ఐటీసీ యాజమాన్యం ఏకంగా రూ.2కోట్ల నిధులతో ఓ బడా కాంట్రాక్టర్ గోడౌన్లకు సిమెంట్ రహదారిని నిర్మిస్తోంది. అసలు ఆ గ్రామానికి ఐటీసీ ఎటువంటి సంబంధం లేదు. భద్రాచలం, మోతె, ఇరవెండి, సారపాక, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామాలను వదిలి బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురంలో గల బడా కాంట్రాక్టర్ గోడౌన్ల వద్దకు 2కి.మీల మేర సిసి రోడ్డును నిర్మించడంపై గిరిజన సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోల్‌కత్తాలోని ఐటీసీ ఛైర్మన్‌కు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు పంపించింది.
లాభాల్లో కొంత బాధిత గ్రామాలకు: వాస్తవానికి ఐటీసీ యాజమాన్యం తమ లాభాల్లో కొంత కంపెనీ బాధిత గ్రామాల్లో వౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేయాలి. కలుషిత జలాలతో పంట పొలాలు పోగొట్టుకుని, ఆ నీటిని తాగి కీళ్ల నొప్పులు ఇతర వ్యాధులతో బాధపడుతున్న గ్రామస్థులకు వీటిని ఖర్చు చేయాలి. ప్రధానంగా సారపాక, ఇరవెండి, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, భద్రాచలం వంటి బాధిత ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు ఇతర సదుపాయాల కోసం నిధులు వెచ్చించాలి. బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం-బూర్గంపాడు మధ్య 10కిలోమీటర్ల మేర 8 ఏళ్ల క్రితం పీఆర్ నిధులతో రహదారిని నిర్మించారు. ఈ రహదారి బీటీ దెబ్బతిన్నది. వీటికి పీఆర్ నిధులు వస్తాయి. కానీ అసలు కంపెనీకి సంబంధం లేని లక్ష్మీపురం గ్రామంలో భద్రాచలంనకు చెందిన బడా కాంట్రాక్టర్ గోడౌన్ల కోసమనే రూ.2కోట్లను మంజూరు చేశారు. 2 కి.మీల రహదారి కూడా లక్ష్మీపురం ఆర్‌అండ్‌బి రహదారి నుంచి సదరు కాంట్రాక్టర్ గోడౌన్ల వరకే ఖర్చు చేస్తున్నారు. ఇది కేవలం కాంట్రాక్టర్ అవసరార్ధమే నిర్మిస్తున్నారనేది నిర్వివాదాంశం. ఇప్పటికే జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఐటీసీ నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా పెడచెవిన పెట్టిన ఐటీసీ అధికారులు ఇష్టానుసారంగా నిధులు ఖర్చు చేశారనే అభియోగాలు ఉన్నాయి. దీనిపై గిరిజన సంఘాలు సైతం ఫిర్యాదు చేయడంతో ఐటీసీ అధికారుల నిధులు దుర్వినియోగం బాగోతంపై జిల్లా కలెక్టర్ ఆరా తీస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని గిరిజన సంఘాలు పట్టుబట్టుతున్నాయి.