ఖమ్మం

ఘనంగా గురుపాడ్యమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం (కల్చరల్), డిసెంబర్ 12: నగరంలో గురుపాడ్యమి వేడుకల్ని శనివారం ఘనంగా నిర్వహించుకున్నారు. కార్తీకమాసంలో వత్తులు వెలిగించలేని భక్తులు పాడ్యమి సందర్భంగా పాడ్యమి వత్తులను వెలిగించి దోషాలను తొలగించాలని వేడుకున్నారు. శుక్రవారం నుండే భక్తులు ఉపవాస దీక్ష చేపట్టి శనివారం తెల్లవారుజామునే లేచి తలారా స్నానమాడి భక్తి శ్రద్ధలతో వత్తులను వెలిగించారు. వత్తులను వెలిగించడానికి ప్రత్యేకంగా భక్తులు అరటి బెరడుతో దొప్పలను చేసి ఉపయోగించడం విశేషం. ప్రధానంగా ఈ వేడుకలకు నగరంలోని శివాలయాలు వేదికయ్యాయి. స్థానిక కాల్వొడ్డులోని గుంటుమల్లేశ్వరాలయంలోని శివాలయం, సుగ్గులవారి తోటలోని శివాలయం, బ్రాహ్మణబజారులోని శివాలయంతో పాటు ఇతర ఆలయాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. గుంటుమల్లేశ్వరాలయంలోని జరిగిన సామూహిక కుంకుమ పూజకు విశేష స్పందన వచ్చింది. వందలాది మంది భక్తులు ఈ పూజలో పాల్గొని తరించి పోయారు. అనంతరం జరిగిన మహా అన్నదాన కార్యక్రమంలో 20 వేల మంది భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయాలకు వెళ్ళలేని భక్తులు తమ ఇండ్ల వద్దనే వత్తులను వెలిగించి వెడల్పాటి పాత్రలో వదిలారు. నగరంలోని 3 టౌన్ ప్రాంతానికి చెందిన భక్తులు తాము వెలిగించిన వత్తులను మునే్నరులో, 2 టౌన్ ప్రాంతానికి చెందిన భక్తులు సాగర్ కెనాల్‌లో వదిలి భక్తిని చాటుకున్నారు.