ఖమ్మం

రోహిణి ప్రభావం చూపుతున్న ఎండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామేపల్లి, మే 24: రోహిణికార్తె ప్రవేశానికి ముందే రెండురోజులుగా ఉష్ణోగ్రత తీవ్రమై అగ్నిగుండంగా మారింది. రోహిణికార్తెలో రోళ్ళు పగిలే విధంగా ఎండలు తీవ్రంగా ఉంటాయని పెద్దలు చెప్పిన విధంగా అంతకు మించే బాణుడి ప్రతాపం చూపిస్తోందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఉష్ణోగ్రత పెరగడంతో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉంటున్నాయి. ఉష్ణోగ్రత సుమారు 50 డిగ్రీల వరకు ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. మండల తహశీల్దార్ కార్యాలయం ఎప్పుడూ కళకళలాడే నాగార్జున గ్రామీణ బ్యాంక్, ఎస్‌బిహెచ్ తదితర కార్యాలయాలు ఎండతీవ్రతకు వెలవెలబోతున్నాయి. మండలంలో పండుటాకులైన వృద్ధులు రాలిపోతున్నారు. పొనె్నకల్లు గ్రామానికి చెందిన 80 సంవత్సరాల వయోవృద్ధుడు ధారావత్ రాములు వడగాలులు, ఎండతీవ్రతకు మృతిచెందాడు. వేసవి తీవ్రత మరెంతకాలం ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు.