ఖమ్మం

నిర్బంధంగా గ్రామసభ జరపటం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మణుగూరు, మార్చి 17: భద్రాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణం కోసం బీటీపీఎస్ ఆవరణలో జరిగిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కేవలం నిర్బంధ గ్రామసభ మాత్రమేనని పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అభివర్ణించారు. అడుగడుగునా ఆంక్షలు విధించి పోలీసు పహారా మధ్య ప్రజాభిప్రాయం చెప్పమనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. బీటీపీఎస్ ప్రతిపాదిత స్థలానికి 10కి.మీ. పరిధిలో ఉన్న ప్రతీ గ్రామం పర్యావరణ ప్రభావిత గ్రామాల పరిధిలోకి వస్తాయని, ఆ సంగతి విస్మరించి ఏ గ్రామం నుంచి ప్రజలు తరలి రాకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని ఆయన దుయ్యబట్టారు. కాలుష్య నియంత్రణా మండలి టెక్నాలజీ విషయంలో బీటీపీఎస్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని ఆదేశాలు ఇస్తే టెక్నాలజీ పెద్ద సమస్య కాదని జెన్‌కో ఎండీ స్థాయి అధికారి పేర్కొనడం దురదృష్టకరమన్నారు. 80 శాతం ప్రజల ఆమోదం లేకుండా ప్రజాభిప్రాయం సేకరించకుండా కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయాన్ని సైతం తప్పుబడుతున్న అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టే బదులు కాలుష్య నియంత్రణ మండలికే తమ వివరణ ఇచ్చుకుని ఉంటే బాగుండేదని ఆయన అన్నారుభద్రాద్రి పవర్‌ఫ్లాంట్ నిర్మాణంలో టెక్నాలజీ విషయంలోనే కాక నిర్వాసితుల ఎంపిక, ఉద్యోగ నియామక ఒప్పందాలు, పరిసర గ్రామాల అభివృద్ధితో పాటు పలు అంశాల్లో అధికారులు అనేక తప్పులకు పాల్పడ్డారని ఆరోపించారు. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం సబ్ క్రిటికల్ టెక్నాలజీ విధానంపై జెన్‌కోకు స్పష్టమైన విధి విధినాలు రూపొందించిందని, వాటి తుంగలో తొక్కి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ చేపడుతున్న బీటీపీఎస్ నిర్మాణంలో టెక్నాలజీని కచ్ఛితంగా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు.