ఖమ్మం

ఖరీఫ్ ప్రారంభమవుతున్నా... జాడలేని వ్యవసాయాధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 24: ఆధునిక వ్యవసాయం పేరుతో రైతులకు ప్రత్యామ్నాయం చూపిస్తామని చెప్తున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంలేదు. ప్రధానంగా జిల్లాలో అధికంగా సాగయ్యే పత్తి పంట నుంచి రైతులను మారాలని ప్రకటనలు గుప్పిస్తున్న ప్రభుత్వ పెద్దలు క్షేత్ర స్థాయిలో వ్యవసాయశాఖ అధికారులు లేకపోవడంతో అది రైతుల చెంతకు చేరడంలేదనే విషయాన్ని గమనించడం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రైతులకు సూచనలు ఇవ్వాల్సిన అధికారులు లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రధానంగా ప్రత్యామ్నాయ పంటల గురించి క్షేత్ర స్థాయిలో చెప్పే అధికారులు కరవయ్యారు. జిల్లాలో క్షేత్ర స్థాయిలో పనిచేసే వ్యవసాయశాఖ అధికారుల పోస్టులు 109 ఉండగా ఇందులో 49 ఖాళీగా ఉండడం గమనార్హం. ఇక జిల్లా కేంద్రంలో 18 వ్యవసాయ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో సాంకేతిక, లాబరోటరి పోస్టులు కూడా ఖాళీగా ఉండడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా నలుగురు సాంకేతిక వ్యవసాయ అధికారులు ఉండగా ఆ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. రాష్ట్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గం ఖమ్మం డివిజన్‌లో ఉండగా ఇక్కడ మొత్తం 16 ఏఇవో పోస్టులు ఉండగా 10 ఖాళీగానే ఉన్నాయి. మధిర డివిజన్‌లో 12కు 5, సత్తుపల్లి డివిజన్‌లో 11కు 6, గార్ల డివిజన్‌లో 9కి 6, ఇల్లెందు డివిజన్‌లో 7కు 2, కొత్తగూడెం డివిజన్‌లో 9కు 2, పాల్వంచ డివిజన్‌లో 11కు 2, మోరంపల్లిబంజర డివిజన్‌లో 13కు 5, భద్రాచలం డివిజన్‌లో 9కి 8, చర్ల డివిజన్‌లో 12కు 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వగ్రామం ఉన్న దమ్మపేట మండలంలో 3 ఏఇవో పోస్టులు ఉండగా ఒకటి ఖాళీగానే ఉంది.
ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఎఇవో పోస్టుల ఖాళీలు రైతాంగానికి మరింత నష్టాన్ని చేకూర్చనున్నాయి. మంత్రి తుమ్మల దత్తత తీసుకున్న తిరుమలాయపాలెం మండలంలో రైతులకు పత్తికి బదులు ప్రత్యామ్నాయం వేయాలని సూచించినా దానిని అమలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. జిల్లా కేంద్రం నుంచి ఒకరిద్దరు ఆ మండలంలోని కొన్ని గ్రామాలకు వెళ్ళి ప్రత్యామ్నాయ పంటల వివరాలను త్వరలోనే చెప్తామని చెప్పడం గమనార్హం. మరో వైపు నకిలీ ఫెర్టిలైజర్స్‌ను అరికట్టేందుకు ఖమ్మంలోని ఫెర్టిలైజర్స్ ల్యాబ్‌లోని వ్యవసాయ అధికారి పోస్టు ఖాళీగానే ఉండడంతో ఈసారి కూడా నాణ్యత లేని మందులు చలామణి అయ్యే అవకాశం ఉంది.