ఖమ్మం

తెలంగాణ సమగ్రాభివృద్ధిపై చర్చ జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(కల్చరల్), మే 26: జూన్ 2న జరగనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సమగ్రాభివృద్ధిపై చర్చ జరగాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి వెంకట్ పేర్కొన్నారు. స్థానిక రాజ్‌పథ్ ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న రెండవ రోజు శిక్షణ తరగతుల్లో గురువారం చారిత్రిక భౌతికవాదం, భారత సమాజ పరిణామ క్రమం అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయానికి, ప్రాజెక్టులకు, పరిశ్రమలకు, సంక్షేమ రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. ప్రాజెక్టుల పేరుతో భూములను లాక్కోవడం సరైంది కాదన్నారు. భూ సేకరణ నిమిత్తం ప్రభుత్వం తీసుకొచ్చిన 123 జీఓ వల్ల రైతాంగానికి నష్టం వాటిల్లుతుందన్నారు. ఇది కేవలం రైతుల నుండి భూములను గుంజుకునే జీవోగా ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే భూ సేకరణ, అలాగే 123 జీఓపై సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఈ జీఓతో రైతులు వ్యవసాయ కూలీలుగా మారే ప్రమాదం ఉందని ఆవేదన చెందారు. ప్రాధాన్యత క్రమంలోనే ప్రాజెక్ట్‌లు పూర్తి చేయాలన్నారు. ఉపాధి కల్పించే పారిశ్రామిక విధానం కావాలన్నారు. ప్రస్తుతం ప్రజలకు ఉపాధి కల్పించే పద్ధతిలో ఉన్నటల్ల కనిపించడం లేదన్నారు. మూలనపడ్డ పరిశ్రమలను తెరిపించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సంక్షేమ రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తునట్లు కనిపించడం లేదన్నారు. ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి పథకాలు మినహా రాష్ట్రంలో ఏ పథకం అమలు కావడం లేదన్నారు. పేదలకు భూ పంపిణీ, డబుల్‌బెడ్ రూం ఇళ్ళు, కేజీ టూ పిజి ఉచిత విద్య, అటవీ హక్కుల చట్టం అమలు తదితర పథకాలన్నీ అమలుకు నోచుకోవడం లేదన్నారు. సంక్షేమానికి ప్రాధాన్యత నివ్వకుండా రాష్ట్రం అభివృద్ధి జరగడం సాధ్యం కాదన్నారు. అందుకే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సమగ్రాభివృద్ధిపై సమగ్ర చర్చ జరగాలన్నారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు కార్యకర్తలకు సిద్ధాంత పరంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సిపియం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు శిక్షణా తరగతులకు ప్రిన్సిపల్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, పార్టీ రాష్ట్ర కమిటి, జిల్లా కార్యదర్శి వర్గ, జిల్లా కమిటి సభ్యులు పాల్గొన్నారు.