ఖమ్మం

సివిల్ సప్లయ్ హమాలీల సమస్యలపై పోరాడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(కల్చరల్), మే 27: రాష్ట్ర పౌరసరఫరాల సంస్థలో పనిచేస్తున్న హామాలీల న్యాయమైన డిమాండ్లు పరిష్కారమైయ్యేంత వరకు పోరాడతామని తెలంగాణ సివిల్ సప్లయ్ హమాలీల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి అంజిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఖమ్మంలో మూడవ రోజు సమ్మెనుద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పౌరసరఫరాల సంస్ధ హమాలీల నూతన రేట్ల ఒప్పందం ప్రతి రెండు సంవత్సరాలకొకసారి జరిగాల్సి ఉందన్నారు. గత ఒప్పందం 2014 జనవరిలో జరిందని, దాని కాలపరిమితి 2015 డిసెంబర్‌తోముగిసిందన్నారు. 5 నెలలుగా అధికారులకు వివిధ రూపాల్లో మా కష్టాలను మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థలో పని చేస్తున్న హమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, 2012, 2014 లో జరిగిన ఒప్పందం ప్రకారం 50 శాతం రేట్లు పెంచాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంఎల్‌ఎస్ పాంయిట్లకు సొంత గోరాములు నిర్మించాలని, జనశ్రీ బీమా యోజన వంటి తదితర డిమాండ్ల సాధనకై సిఐటియు, ఎఐటియుసిల ఆద్వర్యంలో సమ్మెను చేపట్టినట్లు ఆయన తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి అర్ధాకాలితో అలమటిస్తున్న హమాలీల సమస్యలు పరిస్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సమ్మెను మిగిలిన సంఘాలను కలుపుకొని మరింత ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
3వ రోజుకు చేరిన సివిల్ సప్లయ్ హమాలీల సమ్మె
ఖమ్మం పౌర సరఫరాల సంస్ధలో పని చేస్తున్న హమాలీలు తమ న్యాయమైన సమస్యలు పరిస్కరించాలని కోరుతూ చేస్తున్న సమ్మె శుక్రవారంతో 3వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా ఆల్ యూనియన్స్ జిల్లా కన్వీనర్ భూక్యా శ్రీను మాట్లాడుతూ హమాలీల నూతన రేట్ల ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె 3రోజులకు చేరినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హమాలీల సమస్యలు పరిస్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన డిమాండ్ చేశారు. కొమ్ము శ్రీను అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీలర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు చంద్రశేఖర్, గోళ్ళ మురళి, రంగారావు, మహేష్, ఎస్‌కె జానీ, చెరుకూరి శంకర్‌నారాయణ, దీపాల మహేష్‌లు పాల్గొని తమ మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిర్చి ఎగుమతి శాఖ నాయకులు నాగరాజు, బత్తిని లింగయ్య, ఎం విజయ్, ఆర్ శ్రీను, రామకృష్ణ, గురవయ్య, శ్రీకాంత్, వీరస్వామి, జె కృష్ణ, ఎన్ వెంకన్న మరియు హమాలీ కార్మికులు పాల్గొన్నారు.