ఖమ్మం

మిషన్ కాకతీయ పనులపై మంత్రి తుమ్మల అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దమ్మపేట, మే 30: మిషన్ కాకతీయలో భాగంగా మరమ్మతులు చేస్తున్న చెరువు పనులపై రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. గుండుగులపల్లిలోని ఆయన స్వగృహంలో సోమవారం అధికారులతో మంత్రి మాట్లాడారు. మిషన్ కాకతీయ రెండవ విడత పనుల్లో నాణ్యత ఏమాత్రం లేదన్నారు. అధికారులు దగ్గరుండి పర్యవేక్షించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు అంగీకరిస్తేనే బిల్లులు చెల్లించాలి తప్ప బిల్లులు మంజూరు చేస్తే సహించేది లేదన్నారు. వర్షాకాలం ముంచుకొస్తున్నా పనులు జరగకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. తొలి విడత చెరువు పనులు బిల్లులు ఎందుకు మంజూరు చేశారని ప్రశ్నించారు. చెరువు మరమ్మతులు పూర్తి కాకుండానే బిల్లులు చెల్లించారని అధికారులపై మండిపడ్డారు. మంత్రి తుమ్మలను అంగన్‌వాడీ వర్కర్లు కలిసి రెండు నెలలుగా వేతనాలు రావడంలేదని వాపోయారు. తక్షణమే జీతాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారు. అంగన్‌వాడీ సెంటర్లకు గుడ్లు సరఫరా కావడం లేదని వర్కర్లు చెప్పారు. కాంట్రాక్టర్లతో వర్కర్లు కుమ్మక్కు కావడం వల్లనే ఇటువంటి సమస్య వస్తుందని ఆయన ఎదురు ప్రశ్నించారు. అంగన్‌వాడీ సెంటర్లు సక్రమంగా పనిచేసేలా చూడాలని సూపర్‌వైజర్లకు సూచించారు. మైనార్టీ నాయకులు తుమ్మలను కలిసి నామినేటెడ్ పదవుల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మైనార్టీ వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తామని తుమ్మల హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట, దమ్మపేట మండల పార్టీ అధ్యక్షులు బండి పుల్లారావు, పానుగంటి సత్యం, చల్లగుళ్ల నర్సింహారావు, పైడి వెంకటేశ్వరరావు, రాజేశ్వరరావు తదితరులు ఉన్నారు.