ఖమ్మం

కుమారుడిని అమరుడిగా గుర్తించాలంటూ మహిళ ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), జూన్ 2: తన కుమారుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని అమరుడైనా ప్రభుత్వం గుర్తించడం లేదంటూ నల్గొండ జిల్లాకు చెందిన ఓ మహిళ ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నల్గొండ జిల్లా మునగాల మండలం రెపాల గ్రామానికి చెందిన సుగుణమ్మ తన కుమారుడు సుధాకర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారని, సకలజనుల సమ్మె తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొంది. పంచాయతీరాజ్‌శాఖలో ఉద్యోగిగా ఉన్న కుమారుడిపైనే కుటుంబం ఆధారపడి ఉందని, కనీసం అమరవీరుడిగా కూడా ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరంమంటూ పరేడ్ గ్రౌండ్ వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసిన అనంతరం డొమెక్స్ సిరప్‌లో ఎండ్రిన్ కలుపుకొని తాగింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.