ఖమ్మం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు మరింత బాధ్యతను పెంచాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూన్ 2: పారిశ్రామిక రంగంలో ప్రగతిబాటలో పయనిస్తున్న సింగరేణి సంస్థకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన అవార్డులు మనపై మరింత బాధ్యతను పెంచాయని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ అన్నారు. స్థానిక ప్రకాశం స్టేడియంలో సింగరేణి ఆధ్వర్యంలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ ప్రధాన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మొదట జాతీయ పతాకాన్ని సిఎండి ఆవిష్కరించిన అనంతరం గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంచికి ఎప్పుడూ గుర్తింపు లభిస్తుందని, మన అభివృద్ధి, మన సంక్షేమ కార్యక్రమాలు, పారిశ్రామిక సంబంధాలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ మేనేజ్‌మెంట్ అవార్డును బహుకరించిందన్నారు. అదేవిధంగా సంస్థకు ఎక్స్‌లెన్స్ అవార్డు ఇన్ కాస్ట్‌మేనేజ్‌మెంట్ - 2015 అవార్డును గతనెల 28న ఢిల్లీలో అందజేశారని చెప్పారు. ఈఅవార్డులు సమష్టి కృషికి, అంకితభావానికి గుర్తింపుగా భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకాంక్ష ప్రకారం సింగరేణీయుల పనివిధానంలో మార్పురావాలని, పాతతరహా అలసత్వం పోవాలని మన తెలంగాణ, మనరాష్ట్రం, మన ప్రగతి అనే ధ్యాస ప్రతి ఒక్కరిలో కలగాలన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా రూపుదిద్దాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, దీని కోసం అంకితభావంతో సమష్టి కృషితో సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించి మరెన్నో విజయ శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత తొలిసారిగా ఐదువేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన ఘనత సింగరేణికి దక్కుతుందన్నారు. రాబోయే ఐదేళ్లకాలంలో 28కొత్త బొగ్గుగనులను ప్రారంభించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని, వీటిలో 7గనులను ఈఆర్థిక సంవత్సరంలో ప్రారంభించుకోబోతున్నట్లు ఆయన ప్రకటించారు. కార్మికులకు అనేక సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆరోగ్యం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలుచేశామన్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చేవిధంగా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను పెంచుకోవడంతో పాటు ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 1200మెగావాట్ల విద్యుత్‌ప్లాంట్‌లు ఉత్పత్తికి సిద్ధమయ్యాయని, త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్రానికి అంకితం చేసే శుభతరుణం రానున్నదని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో నెంబర్-1గా దూసుకుపోతుందని కొనియాడారు. ఈఆర్థిక సంవత్సరంలో 660లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించుకోవడానికి సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు ఎ మనోహర్‌రావు, బిక్కి రమేష్‌కుమార్, జె పవిత్రన్‌కుమార్, తెలంగాణ ఉత్సవ కన్వీనర్ ఆనందరావు, ఇతర అధికారులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.