ఖమ్మం

చినుకు పడుతున్నా చేరని విత్తనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), జూన్ 3: ప్రతి సంవత్సరం మాదిరిగానే జిల్లాలో రైతులకు ఈ సంవత్సరం కూడా విత్తనాలు తలనొప్పులు తేనున్నాయి. వ్యవసాయశాఖ అధికారులు జిల్లా సాధార విస్తీర్ణ సాగు అంచనా వేసి లెక్కలు కట్టి ప్రభుత్వానికి విత్తన అవసర నివేదికలు పంపించింది. కాని నేటికి జిల్లాకు పూర్తి స్థాయిలో విత్తనాలు చేరలేదు. పచ్చిరొట్ట విత్తనాలు 10వేల క్వింటాళ్ళ మేర జిల్లాకు అవసరం ఉన్నా వచ్చింది మాత్రం 5 వేల క్వింటాళ్ళు మాత్రమే. పత్తికి ప్రత్యామ్నాయ పంటగా భావిస్తున్న సోయాబీన్ విత్తనాలు కేజి కూడా జిల్లాకు చేరలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో రెండు మూడు రోజుల్లో దేశంలోకి రుతుపవనాలు చేరుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండడంతో రాష్ట్రంలో కూడా ముందుగానే వర్షాలు పడతాయనే అంచనాలో రైతులు ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో జల్లులు పడుతుండడంతో రైతులు పంటలను సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పొడి దుక్కులు దున్నుకొని పొలాలను సాగుకు రైతులు సిద్ధంగా ఉంచుకున్నారు. గత మూడు రోజుల నుంచి జిల్లాలో అక్కడక్కడ పడుతున్న జల్లులతో రైతులు పచ్చిరొట్ట ఎరువులను వేసేందుకు సన్నద్ధమయ్యారు. విత్తనాలు తీసుకునేందుకు సొసైటీలకు వెళ్ళడంతో అక్కడ విత్తనాలు సరిపడ లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాకు పచ్చిరొట్ట విత్తనాలు అయిన జిలుగు 3,400 క్వింటాళ్ళు, జనుము 400 క్వింటాళ్ళు, పిల్లిపెసర 600 క్వింటాళ్ళు, కంది 200 క్వింటాళ్ళు మాత్రమే చేరాయి. ఈ విత్తనాలు పూర్తి స్థాయిలో రాకపోవడంతో సాగు సమయానికి విత్తనాలు అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన పరిస్థితి నెలకొన్నది. కాగా ప్రభుత్వం, వ్యవసాయశాఖ అధికారులు పత్తికి ప్రత్యామ్న్యాయంగా రైతులచే సోయాబీన్ సాగుచేయించేందుకు చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. కానీ నేటికీ జిల్లాకు సోయాబీన్ విత్తనాలు చేరలేదు. దీంతో రైతులు మళ్లీ పత్తి పంటలను వేసేందుకు మొగ్గు చూపించే అవకాశం ఉంది.