ఖమ్మం

యోగా - నేచురోపతి విధానాలతో వ్యాధులు మటుమాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం రూరల్, జూన్ 7: మానవశరీరంలో మందగించిన జీవన ప్రక్రియ ద్వారా అవసరంలేని వ్యర్ధ రసాయన పదార్ధాలు పేరుకుపోవడంతో అనేక వ్యాధులు సంభవిస్తున్నాయని, వ్యాధులన్నింటిని ప్రకృతి ప్రసాదించిన అద్భుత సాధనాలైన యోగ, నేచరోపతి విధానాల ద్వారా పూర్తిగా తగ్గించుకోవచ్చని ప్రముఖ ప్రకృతి వైద్యులు డాక్టర్ కెవి రాంచందర్‌రావు, డాక్టర్ పద్మలు అన్నారు. సోమవారం రాత్రి మండల పరిధిలోని సుజాతనగర్‌లో ఏర్పాటుచేసిన షుగర్‌వ్యాధి, కీళ్ళనొప్పులపై జరిగిన అవగాహన సదస్సులో వారు మాట్లాడుతూ నిజాయితీతో, పట్టుదలతో ప్రయత్నిస్తే పాంక్రియాస్ పని మెరుగుఅవుతుందని, తద్వారా షుగర్‌వ్యాధిని పూర్తిస్థాయిలో నియంత్రించవచ్చన్నారు. ప్రకృతి జీవనవిధానం వ్యవస్థాపకులు డాక్టర్ రాంచందర్‌రావు మాట్లాడుతూ తేలికపాటి పద్దతులైన వాకింగ్, యోగా, స్విమ్మింగ్‌ల ద్వారా శరీరానికి శ్రమ కల్గించడంతో మెటబలిజం క్రియ సక్రమంగా జరిగి వ్యాధులు దూరవౌతాయన్నారు. శరీరంలో రోగకారక పదార్ధాలైన వెస్ట్‌కెమికల్‌ను బయటకు పంపించడానికి ప్రకృతి జీవనవిధానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అవగాహన సదస్సులో స్థానికులు నాగసీతరాములు, రాఘవరావు, యోగ గురువు బాబురావు, కందుల సుధాకర్‌రెడ్డి, సీతారాములు, బరిగిరి సాహేబ్ పాల్గొన్నారు.