ఖమ్మం

10వ వేజ్‌బోర్డు నుండి సింగరేణిని మినహాయిస్తే సహించేదిలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూన్ 7: కోల్ వేజ్‌బోర్డులో భాగస్వామిగా ఉన్న సింగరేణిని 10వ వేజ్‌బోర్డు నుండి మినహాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గుర్తింపుసంఘమైన టిబిజికెఎస్ చేస్తున్న కుట్రలు సింగరేణి కార్మికులను బలిచేస్తాయని, ఈవిధానాన్ని సహించేదిలేదని ఎఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అడిషనల్ సెక్రటరీ మిర్యాల రంగయ్య హెచ్చరించారు. స్థానిక మెయిన్ వర్క్‌షాప్‌లో మంగళవారం జరిగిన పిట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ 9వవేజ్‌బోర్డు కాలపరిమితి ఈనెలతో ముగుస్తున్నందున 10వవేజ్‌బోర్డును వెంటనే వేయాలని లేనిపక్షంలో కార్మికులు పోరాటాలకు సిద్ధంగావుండాలని పిలుపునిచ్చారు. సకలజనుల సమ్మెవేతనాన్ని ఈనెల 30వతేదీలోగా చెల్లిస్తామని, వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, ఓపెన్‌కాస్టులను తియ్యబోమని, నూతన భూగర్భగనులను ప్రారంభిస్తామని చెప్పిన యాజమాన్యం, ప్రభుత్వం, గుర్తింపుసంఘం వాటిని అమలుచేయకపోగా ఐదు భూగర్భగనులను ప్రైవేట్ వారికి అప్పగించాలని నిర్ణయించడం కార్మికులకు ఆగ్రహం కలిగిస్తుందని పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ, గోదావరి పుష్కరాలు, రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు కోట్లాది సింగరేణి డబ్బును ఖర్చుచేస్తున్నారని కానీ కార్మికుల సంక్షేమం పట్ల, వారి వేతనాల పెంపుపై నిర్లిప్తంగా ఉండటాన్ని కార్మికులు గమనించాలని కోరారు. సమస్యల పరిష్కారంలో గుర్తింపుసంఘమైన టిబిజికెఎస్ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. స్థానిక సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి పోరాటాల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. ఈసమావేశంలో డెప్యూటీ ప్రధాన కార్యదర్శి దమ్మాలపాటి శేషయ్య, ఉపాధ్యక్షులు కృష్ట్ఫర్, పిట్ కార్యదర్శి రశీద్, ఎండి ఇస్మాయిల్, హనీఫ్, ఓదేలు, మేరుగు సత్యనారాయణ, ఆనంద్, ముజాహిద్ పాల్గొన్నారు.