ఖమ్మం

జోరుగా ప్రైవేటు విద్యా వ్యాపారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూన్ 7: జిల్లాలో సంపాదనే ధ్యేయంగా పలు విద్యాసంస్థలు వెలిశాయి. ఆ విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చటంతో విద్యను కొనలేక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న పరిస్థితి జిల్లాలో చోటు చేసుకుంటుంది. జిల్లాలో సుమారు 1500 ప్రైవేటు పాఠశాలలు ఉండగా అనేక పాఠశాలలు లాభార్జనే ధ్యేయంగా పని చేస్తున్నాయనే విమర్శలు మెండుగానే విన్పిస్తున్నాయి. ఎల్‌కెజి విద్యార్థికి 25వేల రూపాయల ఫీజును పలు విద్యాసంస్థలు వసూలు చేస్తున్నాయంటే వారి లక్ష్యం కొట్టొచ్చినట్లే కన్పిస్తోంది. లాభార్జనే ధ్యేయంగా ఏర్పాటు చేస్తున్న విద్యాసంస్థలు విద్యార్థులకు కనీస వౌలిక వసతులు కల్పించటంలో ఘోరంగా విఫలమవుతున్నాయి. ప్రశ్నించిన వారిపై యజమాన్యాలు దురురుగా ప్రవర్తిస్తున్నాయని పలువురు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయలు ఫీజులు చెల్లించినప్పటికీ ఆ స్థాయిలో సౌకర్యాలు లేమి వేధిస్తోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు లేకపోవటంతో తమ పిల్లలు అవస్థలు పడవద్దని ప్రైవేటు విద్యాసంస్థల్లో చేర్పిస్తే అక్కడ ఆ సమస్యలే వారిని వేధిస్తున్నాయి. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో అల్లాడుతున్నారు. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలో నెలకొన్న సమస్యలు, వాటి పరిస్థితిని వివరించినా జిల్లా విద్యాశాఖాధికారులు స్పందించిన దాఖలాలు లేవనే ఆరోపణలు మిన్నగా ఉన్నాయి.
నిబంధనలు గాల్లోకి
జిల్లా విద్యాశాఖ నిబంధనలు కచ్ఛితంగా అమలు చేయాలనే చెప్పటం తప్ప ఆచరించటంలో మాత్రం విఫలమవుతోంది. పాఠశాలలకు అనుమతులు ఉన్నాయా...? వాటి పరిస్థితి ఏంటి....? క్రీడా మైదానం ఉందా...? అగ్నిమాపక పరికరాలతో పాటు పూర్తిస్థాయిలో సౌకర్యాలు ఉంటే పాఠశాల నడిపేందుకు అనుమతులు ఇవ్వాలని, అలాంటివి ఉన్నా లేకున్నా జిల్లా విద్యాశాఖాధికారి అనుమతులు ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో పూర్తిస్థాయిలో ఉన్న కళాశాలలు తక్కువగా ఉన్నాయని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవటం మాత్రం విద్యాశాఖ విఫలమవుతోందనేది స్పష్టమవుతోంది.