ఖమ్మం

ప్రభుత్వ విద్యా సంస్థల్లో వౌలిక వసతుల కల్పనే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురం హవేలి, జూన్ 9: ప్రభుత్వ విద్యా సంస్థల్లో వౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కృషి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. గురువారం స్థానిక టిటిడిసిలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి జిల్లాలోని విద్యా రంగ పరిస్థితులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమిక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ జిల్లాలో పాఠశాలల్లో వౌళిక సదుపాయాల కోసం 187.35 కోట్లు అవసరమని విన్నవించారు. జిల్లాలోని 10 నియోజకవర్గాల వారీగా పాఠశాలల అవసరాల గురించి వివరించిన కలెక్టర్ జిల్లాలో మరిన్ని మోడల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి దీనికి సానుకూలంగా స్పందిస్తూనే ఈ ఏడాది ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇంటర్మీడియట్ విద్యను ఎలాంటి రుసుములు లేకుండా ఉచితంగా అందిస్తున్నామని, పాఠ్యపుస్తకాలను కూడా ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. మెరుగైన ఫలితాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ప్రతి జూనియర్ కళాశాలలో మంచినీరు, మరుగుదొడ్లు, ఆర్వో ప్లాంట్, సిసి కెమేరా, బయోమెట్రిక్ విధానాలను ఈ నెల 30వ తేదీలోగా సమకూర్చాలని, అక్కడికక్కడే ఇంటర్మీడియట్ విద్యా కార్యదర్శిని ఆదేశించారు. కాగా ఖమ్మం జిల్లాలో కొన్ని పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు రావడంలేదని, వాటిపై సమిక్షించుకొని ఈ ఏడాది మెరుగైన ఫలితాలు వచ్చేలా చూడాలన్నారు. ప్రధానంగా దళిత, గిరిజనులు అధికంగా ఉన్న ఖమ్మం జిల్లాలో వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. వారంతా విద్యను అభ్యసించేలా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి కాలంలో కూడా మధ్యాహ్న భోజనాన్ని అమలు చేశామని, అందరికి ప్రభుత్వ విద్య ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు.