ఖమ్మం

వామపక్షాలను కనుమరుగుచేసే శక్తులు పుట్టలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం రూరల్, జూన్ 10: అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సుజాతనగర్ గ్రామపంచాయతీలో నూతనంగా నిర్మించిన సిపిఎం కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టుపార్టీలను కనుమరుగుచేసే శక్తులు పుట్టలేదని స్పష్టం చేశారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసమస్యలను పక్కకునెట్టి తమసొంత ఎజెండాలను అమలుచేయడానికి ఉత్సాహం చూపుతున్నారని విమర్శించారు. కేంద్రంలో మతత్వ బిజెపి పార్టీ పాశవిక దాడులను ప్రోత్సహిస్తోందని, రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం దొరలగడులను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించేహక్కులేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఆశలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కొందరు స్వార్ధపరుల చేతుల్లో బంధించబడడం బాధాకరమన్నారు. ఎన్నికల హామీలలో భాగంగా ప్రజలకు ఇచ్చిన డబుల్‌బెడ్‌రూం, గిరిజనులకు మూడుఎకరాల భూమి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అమలుచేయడంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ విఫలమయ్యారని విమర్శించారు. ప్రజలకు కష్టాలు ఉన్నంతకాలం ఎర్రజెండాలు పోరాటం చేస్తుంటాయని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీలన్ని ఐక్యఉద్యమాలు నిర్వహించి ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. గత 36సంవత్సరాలుగా సిపిఎం పాలనకు అండగావుంటూ నీతివంతమైన పాలనకు అవకాశం ఇస్తున్న సుజాతనగర్ గ్రామప్రజలకు జేజేలు తెలిపారు. ఇతర పార్టీల నాయకులను ప్రలోభపెట్టి టిఆర్‌ఎస్ పార్టీలోకి తీసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిలో 10వవంతు అయినా రాష్ట్భ్రావృద్ధికి కృషి చేస్తే బాగుంటుందని హితవు పలికారు. హరితాహారం పేరుతో గిరిజనుల భూములను లాక్కొవాలని చూస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలను గిరిజనులు ఐక్యంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు దండుకోవడమే కాకుండా రైతుల వద్ద నుండి ఎన్నోఏళ్ళుగా సాగుచేసుకుంటున్న భూమిని గుంజుకోవాలని చూస్తే సహించేదిలేదని హెచ్చరించారు. బంగారు తెలంగాణ అంటూ బాధల తెలంగాణగా మార్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగినరీతిలో బుద్ధి చెబుతారన్నారు. బహిరంగసభలో భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కూనంనేని సాంబశివరావు, సిపిఎం రాష్టక్రమిటీ సభ్యులు రాజారావు, వెంకట్, సాయిబాబు, సోమయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌తో పాటు సిపిఎం నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.