ఖమ్మం

శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం టెండర్లు మళ్లీ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జూన్ 13: శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం టెండర్ల వ్యవహారంలో దేవస్థానం అధికారుల తీరుపై అనేక అనుమానాలు చోటు వ్యక్తమవుతున్నాయి. వ్యాపారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు జోరుగా విన్పిస్తున్నాయి. ఇటీవల నిర్వహిస్తున్న టెండర్లలో వ్యాపారులు డిమాండ్లు పెట్టి టెండర్ల ప్రక్రియకు మోకాలడ్డుతున్నారు. తాజాగా సోమవారం నిర్వహించిన టెండర్లు సైతం వాయిదా పడ్డాయి. ఒకసారి, రెండుసార్లు కాదు, ఏకంగా ఒక పనికి 6 సార్లు టెండర్లు నిర్వహించడం చర్చనీయాంశమవుతోంది. పర్ణశాల రామాలయంలో కొబ్బరికాయలు విక్రయించేందుకు లైసెన్స్, ఫ్యాన్సీ వస్తువులు, దేవుని ఫ్రేమ్స్ ఫోటోలు విక్రయించే లైసెన్స్, పర్ణశాల కుటీరం వద్ద యాత్రీకుల ఫోటోలు తీసే లైసెన్స్, భద్రాచలంలో స్వామి వారి రాజగోపురం ముందు భాగాన యాత్రీకుల ఫోటోలు తీసే లైసెన్స్, భద్రాచలంలో స్వామి వారి ఆలయం పడమర మెట్ల పక్కన కొబ్బరికాయలు, దేవుని ఫ్రేమ్ ఫోటోలు విక్రయించే హక్కు, యాత్రీకుల పాదరక్షలు భద్రపర్చేందుకు లైసెన్స్ పొందేందుకు నిర్వహిస్తున్న టెండర్లు ఏకబిగిన వాయిదా పడుతున్నాయి. సాధారణంగా టెండరుదారు హక్కు గడువు ముగిసిన వెంటనే అతని షాపు ఖాళీ చేయించి టెండర్లు పెడితే దేవస్థానానికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఇలా టెండర్లు వాయిదా వేయడం వల్ల పాత వ్యాపారినే కొత్త టెండరు ఖరారు అయ్యేంత వరకు కొనసాగించే సంప్రదాయం వల్ల దేవస్థానం అధికారులపై అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లాభాల రుచి మరిగిన వ్యాపారులు కావాలనే టెండర్లు వాయిదా వేయించి తమ వ్యాపార లావాదేవీలకు గడువు పొడిగించుకుంటున్నారు. దీంటో అధికారులకు అటు వ్యాపారుల నుంచి తృణమో ఫణమో లభిస్తున్నట్లు సమాచారం. టెండర్లో పాల్గొనే వ్యాపారులు దేవస్థానానికి రూల్స్ పెట్టడం గమనార్హం. రెండేళ్లు హక్కులు కావాలి, ఏడాది డిపాజిట్ కట్టలేము, ప్రతీ మూడు నెలలకు మాత్రమే డిపాజిట్ చెల్లిస్తాం, డిపాజిట్ మరీ ఎక్కువగా ఉంది ఇలా తమ డిమాండ్లను దేవస్థానం ముందు ఉంచి టెండర్లు జరగకుండా వాయిదా వేయించుకుంటున్నారు. దీని వల్ల కాంట్రాక్టర్లు లాభపడుతున్నారు. ఇప్పటికైనా దేవస్థానం ఉన్నతాధికారులు ఆలోచించక పోతే రామయ్య ఆదాయానికి భారీగా గండి పడే ప్రమాదం ఉంది.